Mizoram Election 2023 Counting Live Updates: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలతో పాటు మిజోరం ఎన్నికల కౌంటింగ్ కూడా ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తుల మేరకు ఎన్నికల సంఘం ఒకర రోజు వాయిదా వేసింది. ఆదివారం క్రైస్తవులు సామూహిక ప్రార్థనలకు హాజరవుతున్నందున వారికి పవిత్రమైన రోజు అని.. కౌంటింగ్ తేదీని మార్చాలని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు కోరారు. మిజోరాం క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రం. వారి రిక్వెస్ట్ మేరకు ఈసీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న పోలింగ్ జరగ్గా.. రాష్ట్రంలో మొత్తం 80.66 శాతం ఓటింగ్ నమోదైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) మధ్య హోరాహోరీ పోరును ఉంటుందని తేల్చాయి. మరి అధికారంలోకి ఎవరు వస్తారు..? బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని సీట్లు సాధిస్తాయి..? మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ ఫాలో అవ్వండి..