పొదుపు మంత్రం జపిస్తున్న కర్ణాటక సీఎం కుమారస్వామి

అనవసర ఖర్చులనుతగ్గించుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.

Last Updated : Jun 3, 2018, 08:47 PM IST
పొదుపు మంత్రం జపిస్తున్న కర్ణాటక సీఎం కుమారస్వామి

అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు పటిష్టంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఓ ప్రకటన చేసింది. అందులో వివిధ ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, ఏజెన్సీలు కొత్త కార్ల కొనుగోలుకు సమర్పించిన ప్రతిపాదనలను పునఃసమీక్షించాలని అధికారులను కోరారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, అధికార నివాసాలకు అనవసరంగా మెరుగులు దిద్దడం మానాలని అధికార యంత్రాంగానికి సీఎం సూచించారు.

కీలకమైన అంశాలపై చర్చ సందర్భంగా సవేశమైనప్పడు ఉన్నతాధికారులు మొబైల్ ఫోన్లు తమ వెంట తెచ్చుకోరాదని రెండు రోజుల క్రితమే కుమారస్వామి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మే 23న కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 25న బలనిరూపణ పరీక్షలో నెగ్గగా, ఈనెల 6న మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నారు.

బాధ్యతలు చేపట్టిన 11 రోజుల తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శాఖల కేటాయింపుపై జేడీఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య ఒప్పందం కుదిరిన తరువాత కుమారస్వామి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఒప్పందం ప్రకారం, జేడీఎస్‌కు ఆర్థిక శాఖ, కాంగ్రెస్‌కు హోం మంత్రిత్వ శాఖ పదవులు దక్కనున్నాయి.

Trending News