CBI Arrests Sandip Ghosh: వివాదాస్పద ఆర్జి కర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను ఎట్టకేలకు సీబీఐ ఇవాళ అరెస్ట్ చేసింది. వాస్తవానికి కోల్‌కతా డాక్టర్ హత్యాచారం జరిగిన వెంటనే ఇతనిపైనే ఎక్కువగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరింత వివాదాస్పదమైంది.
ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున ఆర్జి కర్ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్ధిని రేప్ అండ్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో అప్పటి ప్రినిస్పిల్ సందీప్ ఘోష్‌పై విద్యార్ధులు పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. కానీ ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రిన్సిపల్ పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం నేషనల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా నియమించింది. ఈ చర్య మరింత వివాదాస్పదమైంది.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ గత పదిరోజులుగా ఆర్జి కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను విచారిస్తోంది. సీబీఐకు చెందిన యాంటీ కరప్షన్ విభాగం కళాశాల ఆర్ధిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడినట్టు అభియోగాలు మోపుతూ ఇవాళ అరెస్ట్ చేసింది. ఆర్ధిక వ్యవహారాల్లో లంచాల ఆరోపణలకు తోడు కోల్‌కతా వైద్య విద్యార్ధిని హత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆర్జి కర్ కళాశాల మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఫిర్యాదు మేరకు సీబీఐ విచారణ జరిపింది. సందీప్ ఘోష్‌పై ఆర్ధిక అవకతవకలు, మెడికల్ వ్యర్ధాల్లో అవినీతి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, నెపోటిజం, నిబంధనల ఉల్లంఘటన వంటి ఆరోపణలున్నాయి. కోల్‌కతా హైకోర్టు సందీప్ ఘోష్‌ను విచారించాల్సిందిగా సీబీఐను ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.