Kerala Local Body Election Results 2020: కేరళలో నేడు (బుధవారం) స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మరియు ఎన్డీయే మధ్య పోటాపోటీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎర్నాకుళంలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓటమిచెందారు. యూడీఎఫ్ కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థి అయిన కేఎన్ వేణుగోపాల్ బరిలోకి దిగారు.
Also Read: Kajal Aggarwal at Acharya sets: హనీమూన్ నుంచి ఆచార్య సెట్‌కు కాజల్, గౌతమ్ కిచ్లు
భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి పద్మాకుమారి చేతిలో ఒక్క ఓటు తేడాతో వేణుగోపాల్ ఓటమి చెందడం గమనార్హం. బీజేపీ అభ్యర్థి పద్మాకుమారికి 182 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి వేణుగోపాల్‌కు 181 ఓట్లు రావడంతో ఓటమి తప్పలేదు. అయితే ఓటమిపాలైన మేయర్ అభ్యర్థి వేణుగోపాల్ రీకౌంటింగ్ కోరారు.
Also Read: Yearender 2020: భారత్‌లో ఈ ఏడాది చైనాయేతర మొబైల్స్ హవా
వామపక్షాల నేతృత్వంలోని అధికార ఎల్‌డీఎఫ్ కూటమి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం 941 గ్రామపంచాయతీలకుగానూ దాదాపు సగం స్థానాలైన 456 చోట్ల వామపక్షాల కూటమి ఆధిక్యంలో ఉంది. మరోవైపు యూడీఎఫ్ కూటమి 378 గ్రామపంచాయతీలలో సత్తా చాటుతూ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్డీయే ఈ ఎన్నికల్లోనూ తీవ్ర పత్రికూల ఫలితాలు చవిచూస్తోంది. కన్నూరు కార్పొరేషన్ నెగ్గడం ఒక్కటే బీజేపీకి ఊరట కలిగించే విషయం.
Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!
Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe