న్యూ ఢిల్లీ: కేరళ సర్కార్‌కి ఆ రాష్ట్ర హై కోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల కరోనా వైరస్ కారణంగా ఎదురైన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు రానున్న ఐదు నెలల పాటు ప్రతీ నెలలో ఆరు రోజుల జీతాన్ని కట్ (Salary cut) చేయనున్నట్టు ఇటీవల కేరళ సర్కార్ ఆదేశాలు జారీచేయగా... తాజాగా ఆ రాష్ట్ర హై కోర్టు (Kerala high court) ఆ ఆదేశాలపై స్టే విధించింది. పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని విభాగాలు, వర్సిటీల సిబ్బంది జీతాల్లో కోత విధించనున్నట్టు కేరళ సర్కార్ (Kerala govt) జారీ చేసిన ఆదేశాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తిపై పోరాటానికి ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్టు కేరళ సర్కార్ ఈ ఆదేశాల్లో పేర్కొంది.
Also read : ఐటి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
అయితే, కేరళ సర్కార్ జారీ చేసిన ఈ ఆదేశాలపై పలు ఉద్యోగ సంఘాలు కేరళ హై కోర్టును ఆశ్రయించాయి. ఉద్యోగ సంఘాల పిటిషన్లన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేరళ హై కోర్టు.. ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ జారీ అయిన ఆదేశాలపై స్టే విధిస్తున్నట్టు స్పష్టంచేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..