కశ్మీర్ అంశం నుంచి జనాల దృష్టి మరల్చేందుకే చిదంబరం అరెస్ట్ - కార్తీ చిదంబరం

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అరెస్ట్ పై ఆయన కుమారుడు కారీ చిదంబరం స్పందించారు

Last Updated : Aug 22, 2019, 01:55 PM IST
కశ్మీర్ అంశం నుంచి జనాల దృష్టి మరల్చేందుకే చిదంబరం అరెస్ట్ - కార్తీ చిదంబరం

మాజీ కేంద్ర మంత్రి పి. చిందబరం అరెస్ట్ నేపథ్యంలో ఆయన కుమారుడు కార్తీ చిదంబరం స్పందించారు.  కేంద్రమంత్రిగా పని చేసిన వ్యక్తికి ఇంత అమర్యాదపూర్వకంగా అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. ఈ అరెస్ట్ ను కేవలం రాజకీయ కక్ష్యగా తాము భావిస్తున్నామన్నారు. తన తండ్రి , కాంగ్రెస్ పార్టీని బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపించారు.

వాస్తవానికి తన తండ్రి రెగ్యులర్‌గా సీబీఐ విచారణకు హాజరవుతూనే ఉన్నారని... అలాంటప్పుడు ఆయన్ను ఇలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కార్తీ ప్రశ్నించారు. చిదంబరం చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్నారన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కార్తీ చిదంబరం పేర్కొన్నారు. కశ్మీర్ అంశం నుంచి దేశం దృష్టి మరల్చేందుకే చిదంబరం అరెస్ట్ చేశారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం సంచలన ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉంటే చిదంబరం అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు అని వాదిస్తున్న కాంగ్రెస్ నేతలు ...జంతర్ మంతర్ దగ్గర తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన కాంగ్రెస్ దిగారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సీబీఐ,ఈడీ కార్యాలయం ఎదుట 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం చిదంబరంను సీబీఐ హెడ్ క్వార్టస్స్ లో విచారిస్తున్నారు.

 

Trending News