లక్నోలో రాజపుత్ర కర్ణిసేన ప్రతినిధులు ఒక వినూత్నమైన రీతిలో పద్మావత్ చిత్రంపై తమ ప్రతిఘటనను తెలియజేశారు. నావెల్టీ సినిమా థియేటర్ బయట ఒక పెద్ద డేరా వేసి.. లోపలికి వెళ్తున్నవారినందరినీ అడ్డుకొని రోజాపూలు పంచిపెట్టడం ప్రారంభించారు. పైగా సినిమా చూడవద్దని.. ఆ సినిమా డబ్బులు తామే చెల్లి్స్తామని కూడా వారు తెలపడం గమనార్హం.
హింసాత్మకమైన చర్యలు చేపట్టి ప్రజల్లో మార్పు తీసుకురావడం తమకు ఇష్టం లేదని.. అందుకే శాంతియుత మార్గాన్ని ఎంచుకొని తాము రోజాపూలు పంచిపెడుతూ పద్మావత్ చిత్రాన్ని చూడవద్దని స్థానికులను కోరుకుంటున్నామని.. ఒకవేళ వారు టికెట్లు ఇప్పటికే కొనుక్కుంటే.. వాటికి రెండింతలు డబ్బులు ఇస్తామని.. అంతే కానీ సినిమా చూడవద్దని చెబుతున్నామని కర్ణిసేన ప్రతినిధులు తెలపడం విశేషం. ఈ సినిమా రిలీజ్ చేసుకోవచ్చని ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం మనకు తెలిసిందే
Karni Sena members protest at Lucknow's Novelty cinema, present roses to people and appeal to them to not watch the film. A protester says 'we will also compensate money of the tickets in case people have already bought' #Padmaavat pic.twitter.com/uezpold0lG
— ANI UP (@ANINewsUP) January 25, 2018