Karnataka CM Race: బ్లాక్ మెయిలింగ్, తిరుగుబాటు రాజకీయాలపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

Karnataka CM Race: కర్ణాటక పంచాయితీకి రేపటిలోగా పరిష్కారం రావచ్చు. పాలించమని ప్రజలు పగ్గాలు అప్పగించినా ఆ పగ్గాలు ఎవరికివ్వాలనేది కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేకపోతోంది. ఈలోగా ఆ పార్టీ నేత డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 16, 2023, 11:08 AM IST
Karnataka CM Race: బ్లాక్ మెయిలింగ్, తిరుగుబాటు రాజకీయాలపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

Karnataka CM Race: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి ఇవాళ్టికి నాలుగవరోజు. ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది తేలలేదు. సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ మధ్య పంచాయితీ నడుస్తోంది. నిన్న సిద్ధరామయ్య ఢిల్లీ అధిష్టానాన్ని కలిస్తే..ఇవాళ డీకే శివకుమార్ కలవనున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 136 సీట్లతో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ప్రతిపక్షం బీజేపీను 65 సీట్లకు, జనతాదళ్ ఎస్ పార్టీని 19 సీట్లకు పరిమితం చేసింది. ఇప్పుడిక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎవరనే చర్చ నడుస్తోంది. పార్టీలో సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ మధ్య పోటీ నడుస్తోంది. ఓవైపు బెంగళూరులోని షాంగిల్లా హోటల్‌లో ఏఐసీసీ ప్రత్యేక బృందం ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా కలుసుకుంటూ అభిప్రాయలు తెలుసుకుని ఢిల్లీ అధిష్టానానికి నివేదిస్తోంది. మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య నాయకత్వానికి అనుకూలంగా ఉన్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్‌కు ట్రబుల్ షూటర్‌గా మంచి పేరుంది. ఎన్నికల్ని విజయవంతంగా నడిపించడంలో డీకే పాత్ర కీలకం. విస్మరించలేనిది. 

ఇప్పటికే సిద్ధరామయ్య నిన్న ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిశారు. ఇవాళ డీకే శివకుమార్ ఢిల్లీలో అధిష్టానంతో సమావేశం కానున్నారు. ఇద్దరికి ప్రాతినిధ్యం లేదా న్యాయం చేసేవిధంగా ముఖ్యమంత్రి పదవీ కాలాన్నిఇద్దరికీ పంచేలా అధిష్టానం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. మొదటి రెండేళ్లు సిద్ధరామయ్యకు, తరువాతి మూడేళ్లు డీకే శివకుమార్‌కు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ అంగీకరించే పరిస్థితులు కన్పిస్తున్నాయి. బహుశా రేపటిలోగా ఈ ప్రతిపాదన ఆధారంగా నిర్ణయం వెలువడవచ్చని సమాచారం.

నో బ్లాక్ మెయిలింగ్ నథింగ్-డీకే శివకుమార్

అధిష్టానాన్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లేముందు డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయమై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానన్నారు. వెన్నుపోటు పొడవడం, బ్లాక్ మెయిలింగ్ చేయడం వంటి రాజకీయాలు తాను చేయనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎంపికపై అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళుతున్నానన్నారు. తాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బాధ్యతాయుతంగా ఉంటానని చెప్పడం ద్వారా పరోక్షంగా తనకు వ్యతిరేకంగా ఉన్నవారికి సంకేతాలిచ్చారు. 

కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈనెల 18 గురువారం ఉంటుందని తెలుస్తోంది. కొంతమంది మంత్రులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.

Also read: Karnataka Politics: సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్, తేలని సీఎం పంచాయితీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News