Kamal haasan: రజనీకాంత్‌కు కమల్ హాసన్ ఆహ్వానం..కూటమిలోకి పిలుపు

Kamal haasan: తమిళనాట ఎన్నికల వేడి ప్రారంభమైపోయింది. రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ హల్‌చల్ చేస్తున్నారు. ఎంజీఆర్‌కు రాజకీయ వారసుడిని తానే అంటున్నారు.

Last Updated : Dec 17, 2020, 10:11 AM IST
  • రజనీకాంత్‌కు కూటమిలోకి ఆహ్వానించిన కమల్ హాసన్
  • టార్చ్‌లైట్ గుర్తు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన మక్కల్ నీది మయ్యం
  • ఎంజీఆర్‌కు రాజకీయ వారసుడిని తానే అంటున్న కమల్ హసన్
Kamal haasan: రజనీకాంత్‌కు కమల్ హాసన్ ఆహ్వానం..కూటమిలోకి పిలుపు

Kamal haasan: తమిళనాట ఎన్నికల వేడి ప్రారంభమైపోయింది. రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ హల్‌చల్ చేస్తున్నారు. ఎంజీఆర్‌కు రాజకీయ వారసుడిని తానే అంటున్నారు.

మక్కల్ నీది మయ్యం ( Makkal needhi maiam )..తమిళనాట కొత్త రాజకీయపార్టీ. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ( Kamal haasan ) స్థాపించిన ఈ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనుంది. ఏ పార్టీతో పొత్తు ఉంటుందనేది ఇంకా తెలియకపోయినా..పొత్తు మాత్రం ఉంటుందని భావిస్తున్నారు. పార్టీ అధినేత కమల్ హాసన్ ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని( Election campaign ) అందరికంటే ముందే ప్రారంభించి..తిరునల్వేలి, కన్యాకుమారిలో పర్యటించారు. విద్యార్ధులు, యువకులు, మహిళలతో సమావేశమయ్యారు. 

తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ ( Superstar rajinikanth ) సిద్ధాంతాలు వేరైనా తామిద్దరం మంచి స్నేహితులమని మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు ఎలా ఉంటాయనేది రజనీ చేయనున్న వ్యాఖ్యలు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నారు. దివంగత ఎంజీఆర్ కలను సాకారం చేస్తే..తానే రాజకీయే వారసుడిని అవుతానని కమల్ హాసన్ తెలిపారు. 

రాష్ట్రంలో మార్పు జరుగుతుందని ఆశిస్తున్నానని..రజనీకాంత్‌తో రహస్యాలేవీ లేవని చెప్పారు. బహిరంగంగానే రజనీకు ఆహ్వానం పలికానన్నారు. బహిరంగంగా మళ్లీ పిలుస్తున్నానని..కూటమిలోకి రావాలని చమత్కరించారు. మక్కల్ నీది మయ్యం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి సాధ్యమయ్యే అవకాశాలున్నాయన్నారు. అందుకు తగ్గ పరిస్థితుల కోసం  వేచి చూాడాలన్నారు. 

ఇక తమ పార్టీ చిహ్నంగా టార్చ్‌లైట్ ( Torchlight symbol ) కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఈ గుర్తు కోసం ఎన్నికల కమీషన్ ( Election commission )‌ను అభ్యర్ధించనున్నామని..గుర్తు వదులుకునే ప్రసక్తే లేదని చెప్పారు. అటు ఈ గుర్తు కోసం ప్రయత్నిస్తున్న మరో పార్టీ ఎంజీఆర్ మక్కల్ కట్చి మాత్రం టార్చ్‌లైట్ గుర్తు వదులుకునేది లేదని చెబుతోంది. Also read: PM KISAN scheme: పీఎం కిసాన్ డిసెంబర్ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఎప్పుడొస్తాయి ?

Trending News