Black chicken: ఆ కోడి మాంసానికి అంత క్రేజ్ ఎందుకు

Kadaknath Black chicken: మీ దగ్గర నల్లకోడి ఉందా..కరోనా వైరస్ నేపధ్యంలో ఈ కోడికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కోడి మాంసం తింటే చాలు..వైరస్ దరి చేరదట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Last Updated : Nov 28, 2020, 08:33 PM IST
  • రోగ నిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలున్న కోడి కడక్ నాథ్ కోడి
  • చర్మం, గుడ్లు, మాంసం అన్నీ నలుపు రంగులోనే ఉండటం ఈ కోడి ప్రత్యేకత
  • కిలో మాంసం 7 వందల్నించి వేయి రూపాయలు కాగా..ఒక్కో గుడ్డు 40-50 రూపాయలు
Black chicken:  ఆ కోడి మాంసానికి అంత క్రేజ్ ఎందుకు

Kadaknath Black chicken: మీ దగ్గర నల్లకోడి ఉందా..కరోనా వైరస్ నేపధ్యంలో ఈ కోడికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కోడి మాంసం తింటే చాలు..వైరస్ దరి చేరదట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ నేపధ్యంలో ప్రజల్లో ఆరోగ్యం పట్ల..వ్యక్తిగత శుభ్రతపై శ్రద్ధ పెరిగింది. వైరస్ నుంచి రక్షించుకోవడంలో రోగ నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుందని తెలియడంతో..ఇక అందరూ ఇమ్యూనిటీ గెయిన్డ్ ఫుడ్‌పై పడ్డారు. ఇందులో భాగంగా డ్రై ఫ్రూట్స్, పళ్లు, ఆకుకూరలు, కోడిగుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ప్రారంభమైంది. 

ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో నల్లకోడి ( Black Chicken )కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. అది కూడా మధ్యప్రదేశ్ గిరిజన ప్రాంతమైన ఝూబువా, అలీరాజ్‌పూర్‌కే పరిమితమైన దేశీ నల్లకోడి కడక్‌నాథ్‌ ( Kadaknath Black chicken )కు చాలా డిమాండ్ వచ్చేసింది. కరోనా సంక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి ఈ కోడికి డిమాండ్ పెరిగింది. పౌల్ట్రీ ఫామ్ యజమానుల ఆదాయం పెరిగేలా చూడ్డానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జాతి కోళ్ల ఉత్పత్తి, అమ్మకాల్ని పెంచే ప్రణాళిక రూపొందించింది.

కోడి ప్రత్యేకత

దీని ప్రత్యేకత ఏంటంటే..మొత్తం కోడి నల్లటి రంగులో ఉంటుంది. అంటే కోడి ఈకలే కాదు..చర్మం, మాంసం, గుడ్లు అన్నీ నలుపు రంగులోనే ఉంటాయి. రోగ నిరోధక శక్తి ( Immunity ) పెంచే లక్షణాలతో పాటు..తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. గుండె, శ్వాస, రక్తహీనత వ్యాధులతో బాధపడేవారికి ఈ చికెన్ ఎంతో ప్రయోజనకరం. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని జీవించగలవు. అందుకే ఈ కడక్‌నాథ్ కోడి మాంసం ఇప్పుడు కిలో 7 వందల్నించి వేయి రూపాయలు పలుకుతోంది. గుడ్డైతే ఒక్కొక్కటీ 40 నుంచి 50 రూపాయలకు అమ్ముతున్నారు. Also read: Narendra Modi: భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x