జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లాలో ఆదివారం తెల్లవారుఝామున ఉగ్రవాదులు మరోసారి భారత భద్రతాదళాలపై కాల్పులకు తెగబడ్డారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ట్రైనింగ్ సెంటర్లోకి చొరబడి ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. ఉగ్రదాడిలో ఒక సైనికుడు చనిపోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఉదయం రెండున్నర గంటల సమయంలో జరిగింది.
ఏఎన్ఐ కధనం మేరకు తీవ్రవాదులు మొదట గ్రెనైడ్లను విసిరారు. ఆతరువాత కాల్పులు ప్రారంభించారు అని తెలిపింది. "2:10 గంటలకు లెత్పోరా గ్రామంలో తమ శిబిరం వద్ద దాడి జరిగిందని, మరొక దాడికి కూడా అవకాశం ఉంది" అని సీఆర్పీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కారణంగా జమ్మూకాశ్మీర్ జాతీయ రహదారిని మూసివేశారు.
"Fidayeen managed to enter Lethpora camp at 0210hrs. As per report two of our men got injured during initial intrusion from J&K Police Commando training area side.
There is quite possibility of similar type of attack on other camp also" says CRPF— ANI (@ANI) December 30, 2017
ఆగస్టులో, ఎనిమిది మంది భద్రతా సిబ్బంది పుల్వామాలోని ఒక జిల్లా పోలీసు కాంప్లెక్స్ లో తీవ్రవాద దాడిలో తమ ప్రాణాలను కోల్పోయారు.
When most of us are busy planning new year celebrations, our brave #CRPF personnel in #Pulwama, J&K, are busy shedding their blood to protect India's integrity. Let's spare some thoughts for SFs and law enforcement agencies on this day while awaiting the dawn of 2018.
— BS Bassi (@BhimBassi) December 31, 2017
జమ్మూలో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మృతి