JEE Advanced 2024 Results: దేశంలోని దిగ్గజ సంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి ప్రతియేటా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలు జరుగుతుంటాయి. అడ్వాన్స్డ్‌లో ఉత్తీర్ణత చెందితేనే ఐఐటీల్లో ప్రవేశం లభిస్తుంది. మరి కాస్సేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.
దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష మే 26వ తేదీన జరిగింది. దేశవ్యాప్తంగా 1.91 లక్షలమంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్నించి 40 వేల మంది వరకూ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాశారు. అంతకుముందు రెండు సెషన్లలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు 14.10 లక్షలమంది హాజరు కాగా 2 లక్షల 50 వేల 284 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షలను మద్రాస్ ఐఐటీ నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు మే 31న విడుదల కాగా జూన్ 2వ తేదీన ప్రాధమిక కీ రిలీజ్ అయింది. జూన్ 3 వరకూ కీ పై అభ్యంతరాలు స్వీకరించారు. ఇవాళ జూన్ 9వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి.
jeeadv.ac.in.వెబ్‌సైట్ ద్వారా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసిన అభ్యర్ధులు తమ రోల్ నెంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్ మొబైల్ నెంబర్ వివరాలు నమోదు చేసి చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో 17,385 సీట్లు, ఎన్ఐటీల్లో 24 వేల సీట్లు, ట్రిపుల్ ఐటీల్లో 16 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
Also read: IMD Red Alert: రానున్న 4-5 రోజుల్లో ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook