Chandrayaan 3: మరో 96 గంటల్లో ప్రపంచం గర్వించే విధంగా ఇస్రో ఖ్యాతి, ఆగస్టు 23న చంద్రయాన్ 3 సక్సెస్ ఖాయమే

Chandrayaan 3: ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమయ్యేందుకు మరో నాలుగు రోజులే మిగిలుంది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అద్బుత ఘట్టానికి కేవలం 96 గంటలు మిగిలున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 19, 2023, 01:42 PM IST
Chandrayaan 3: మరో 96 గంటల్లో ప్రపంచం గర్వించే విధంగా ఇస్రో ఖ్యాతి, ఆగస్టు 23న చంద్రయాన్ 3 సక్సెస్ ఖాయమే

Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయవంతంగా లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. మరో నాలుగు రోజుల్లో ప్రపంచం గర్వించే విధంగా ఇస్రో తలెత్తుకుని నిలబడుతుంది. అద్భుతమైన ఆ ఘట్టాన్ని సాధించిన నాలుగో దేశంగా ఇండియా ఉండనుంది. ఆ వివరాలు మీ కోసం..

జూలై 14వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అప్పట్నించీ కీలకమైన ఐదు దశలను దాటి లక్ష్యం దిశగా వెళ్తోంది. మొత్తం ప్రయోగంలో అత్యంత కీలకంగా భావించే ల్యాండర్ నుంచి రోవర్ వేరు కావడం పూర్తయింది. ఇప్పుడిక చంద్రుని కక్ష్యలో దూరాన్ని తగ్గించుకుంటూ సురక్షితంగా చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండ్ కావడమే మిగిలింది. 

ఇప్పుడు చంద్రయాన్ 3 మిషన్‌లో ల్యాండర్ మాడ్యూల్ చందమాకు మరింత చేరువకు వచ్చేసింది. నిన్న అంటే ఆగస్టు 18 వతేదీ సాయంత్రం 4 గంటలకు మాడ్యూల్‌లోని ఇంధనాన్ని స్వల్పంగా మండించి చంద్రుని కక్ష్య దూరాన్ని ఇంకాస్త తగ్గించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ చంద్రునికి కేవలం 113 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. రేపు అంటే ఆగస్టు 20వ తేదీ తెల్లవారుజామున ఇంకాస్త తగ్గించనున్నారు. అది కూడా విజయవంతమైతే ఇక ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియ సులభతరమౌతుంది. చంద్రయాన్ 2 కూడా విజయవంతమైనప్పటికీ చివరి దశలో ల్యాండింగ్ ప్రక్రియ విఫలమైంది. అందుకే ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని..దశలవారీగా దూరాన్ని తగ్గించుకుంటూ సేఫ్ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

చంద్రయాన్ 3 మిషన్ ప్రస్తుతం చంద్రునికి 113 కిలోమీటర్ల ఎత్తులోంచి ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమేరా తీసిన ఫోటోలు, వీడియోలను ఇస్రో విడుదల చేసింది. చంద్రయాన్ 3 నౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన తరువాత ఆగస్టు 15, ఆగస్టు 17న రెండుసార్లు ఫోటోలు, వీడియోలు పంపించింది. వీటిలో చంద్రుని ఉపరితలంపై ఉన్న మట్టి దిబ్బలు, అగాధాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

Also read: Chandrayaan 3 Updates: చంద్రయాన్ 3లో చివరి కీలక ఘట్టం సక్సెస్, మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయిన విక్రమ్ ల్యాండర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News