గుడ్ న్యూస్: పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటు పెంచిన కేంద్రం

గుడ్ న్యూస్: పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటు పెంచిన కేంద్రం

Last Updated : Sep 20, 2018, 04:42 PM IST
గుడ్ న్యూస్: పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటు పెంచిన కేంద్రం

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ హోల్డర్స్‌తోపాటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులకు కేంద్రం ఓ చిన్న గుడ్ న్యూస్ వినిపించింది. తాజాగా పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను వడ్డీ రేటును 0.4 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. అనేక ఇతర చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతీ మూడు నెలలకు ఓసారి పునఃసమీక్షించే విషయం తెలిసిందే. అందులో భాగంగానే 2018-19 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమై డిసెంబర్ 31తో ముగియనున్నట్టు మూడో త్రైమాసికానికిగాను తాజాగా వడ్డీ రేట్లను సమీక్షించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ వడ్డీ రేటును 7.8%, రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటును 7.3%, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును 8.7% పెంచుతున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీని ప్రతీ మూడు నెలలకు ఓసారి చెల్లించే సంగతి తెలిసిందే.

Trending News