బ్యాడ్ న్యూస్: రుణాలు తీసుకున్న వారికి చేదు వార్త

రుణగ్రహీతలకు చేదు వార్త చెప్పిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

Last Updated : Aug 1, 2018, 06:30 PM IST
బ్యాడ్ న్యూస్: రుణాలు తీసుకున్న వారికి చేదు వార్త

రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేదు వార్త వినిపించింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ సూచనల మేరకు రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.50 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో బ్యాంకులు ఇక రుణాలపై వడ్డీ శాతాన్ని పెంచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

నాలుగేళ్ల తర్వాత గత జూన్‌లో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్స్ పెంచి 6.25 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. 2013 అక్టోబర్ తర్వాత వరుసగా జరిగిన రెండు సమావేశాల్లో రెపో రేటు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ఇటీవల కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంలో వృద్ధి కనిపించినట్టు ఈ సందర్భంగా ఆర్బీఐ జారీ చేసిన ప్రకటన పేర్కొంది. 

Trending News