Indore Incident: ఘోర విషాదం.. 35 మంది మృతి

Indore Temple Accident: ఇండోర్‌లో మెట్లబావి బావి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరుకుంది. బావి లోతుగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్మీ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బావిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 09:32 AM IST
Indore Incident: ఘోర విషాదం.. 35 మంది మృతి

Indore Temple Accident: మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్‌లో శ్రీరామ నవమి వేడుకల్లో పెను ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో రామ నవమి రోజున ఆలయంలోని మెట్ల బావి పైకప్పు కూలడంతో భక్తులు భారీగా పడిపోయారు.  ఈ ఘటనలో మృతుల సంఖ్య 35కి చేరుకుంది. మృతుల్లో 18 మంది మహిళలతోపాటు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. బావి శిథిలాలలో చిక్కుకున్న మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా చాలా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. మోహౌ నుంచి వచ్చిన ఆర్మీ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. 

స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయం వద్ద శ్రీరామ నవమి సందర్భంగా లోపల ఉన్న మెట్ల బావిపైన ఉన్న పలకపై కూర్చుని పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో పైకప్పు కూలిపోయి అందరూ చాలామంది భక్తులు బావిలోకి పడిపోయారు. మెట్ల బావి దాదాపు 40 అడుగుల లోతు ఉంటుంది. 4 నుంచి 5 అడుగుల మేర నీరు నిండిపోయింది. 

సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో తాళ్ల సహాయంతో బావిలో పడిపోయిన వారిని తీసేందుకు ప్రయత్నించారు. దాదాపు 18 మంది క్షతగాత్రులను బావిలో నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. వీరిలో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది మూడు పంపుల సహాయంతో బావి నుంచి నీరును బయటకు తోడుతున్నారు. దీంతో పాటు డైవర్లను ఆక్సిజన్‌తో బావిలోకి దింపారు. మెట్లబావిలో చాలా చిత్తడిగా ఉందని  అధికారులు`చెబుతున్నారు.

 

దాదాపు 70 మంది ఆర్మీ సిబ్బంది గురువారం రాత్రి 11 గంటలకు మోవ్ నుంచి ఘటన స్థలానికి చేరుకున్నారు. బావిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. మెట్ల బావిలోపల ఊయల వేసి సైనికులను అందులో కూర్చోబెట్టి కట్టర్ మిషన్‌తో రీబార్‌ను కత్తిరించారు. బావిలో మరికొందరు మృతదేహాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

Also Read: IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం  

Also Read: Sunrisers Hyderabad: తొలి మ్యాచ్‌కు ముందు మార్పు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News