Allegation on Petro-Diesel Price: పెట్రోల్ ధర బారెడు పెంచి.. చిటికెడు తగ్గించారు.. ఇదేం న్యాయం..??

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్- డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన కారణంగా పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 10 తగ్గింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.. అదేంటంటే..??  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2021, 03:21 PM IST
  • పెట్రోల్- డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
  • ఎన్నికల్లో ఓటమి కారణం భయంతోనే ఇలా చేసారని ఎద్దేవా..
  • పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 10 తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
Allegation on Petro-Diesel Price: పెట్రోల్ ధర బారెడు పెంచి.. చిటికెడు తగ్గించారు.. ఇదేం న్యాయం..??

 BV Srinivas Allegation on Petrol and Diesel: గత కొద్దీ కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) తగ్గిస్తున్నట్లు ప్రకటించటం.. ఫలితంగా పెట్రోల్ -డీజిల్ (Petrol-Diesel Cost) ధరలు తగ్గిన సంగతి మన అందరికీ తెలిసిందే. స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రజలు కాస్త సంతోషంగా ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. 

కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ (Congress Party) కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు బారెడు పెంచి... చిటికెడు తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించమని మాత్రం చెప్పకండి అంటుంది కాంగ్రెస్ పార్టీ. 

Also Read: T20 World Cup 2021: భారత్ సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతాలు జరగాల్సిందే!

"గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెట్రోల్ పై రూ.28.28.. డీజీల్ పై రూ.27.61  వరకు పెరిగాయి.. ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ పార్టీ ప్రజల్లో సానుకూలత కోసం పెట్రోల్ పై రూ.5.. డీజీల్ పై రూ.10 తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూస్తున్నాం అని మాత్రం చెప్పకండి అంటూ.." ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బీవీ శ్రీనివాస్ (BV Srinivas) ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వగా.. ప్రజలు కూడా దీనికే మద్దతు తెలుపుతున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఓటమి చవిచూస్తున్న కారణంగానే ఇలా పెట్రో-డీజిల్ ధరలు కొద్దిగా తగ్గించారని.. ప్రజల శ్రేయస్సు కోసం కాదని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు 

"ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra) కూడా తీవ్రంగా మండిపడ్డారు.. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓటమి కారణంగానే పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారని.. ఎన్నికల ఓటమి భయం కారణం గానే ఈ నిర్ణయం జరిగిందని... ప్రజలపై ఉన్న భారం తగ్గించే దిశగా తీసుకోలేదని" ఎద్దేవా చేశారు.

Also Read: F3 Movie: సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్న ఎఫ్3.. దీపావళి స్పెషల్ వీడియో రిలీజ్

"అంతేకాకూండా.. నిత్యావసర ధరలను విపరీతంగా పెంచుతున్నారు.. ఎన్నికల ముందు వాటి ధరలను స్వల్పంగా తగ్గించి ప్రజలను ఏమారుస్తున్నారు... ఇలాంటి నాటకీయ పార్టీకీ ప్రజలు తప్పకుండా బుద్ది చెప్పాలని" పేర్కొన్నారు.     

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

  

Trending News