భారతీయ రైల్వేలో విఐపి కల్చర్‌కు చెక్

Last Updated : Oct 8, 2017, 01:49 PM IST
భారతీయ రైల్వేలో విఐపి కల్చర్‌కు చెక్

భారతీయ రైల్వేలో ఇక విఐపి కల్చర్‌‌కు చెక్ పడనుంది. కొత్త నిబంధనల ప్రకారం రైల్వే బోర్డు ఛైర్మన్‌తో సహా బోర్డు మెంబర్లు ఎవరైనా సరే, ఏ స్టేషన్‌నైనా సందర్శించడానికి వచ్చేటప్పుడు వారిని గౌరవ సూచకంగా  కలవడానికి లేదా రిసీవ్ చేసుకోవడానికి ఏ రైల్వే అధికారి ప్రయత్నించకూడదు. అలాగే బొకేలతో స్వాగతం పలకడం లాంటి కార్యక్రమాలకు కూడా ఇక స్వస్తి పలకాల్సిందే. 36 సంవత్సరాలుగా పాటిస్తున్న ఈ ప్రొటోకాల్‌ ఇక ఏ రైల్వే అధికారి పాటించనవసరం లేదని, అలాగే సామాన్య రైల్వే ఉద్యోగులు ఎవరూ రైల్వే ఉన్నతద్యోగులు వచ్చినప్పుడు, వారి సౌకర్యాలు చూడనవసరం లేదని, వాటికి ఆయా వ్యక్తులే ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే మంత్రి పీయూష్ చావ్లా తెలియజేశారు. కేవలం రైల్లో వచ్చే అధికారులను మాత్రమే కాదు, ఫ్లైట్‌లో వచ్చే అధికారుల విషయంలో కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. అదే విధంగా బోర్డు ఛైర్మన్‌తో సహా మెంబర్లు అందరికీ ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్లను ఇక ప్రభుత్వం ఇక అందించదని, కేవలం వారు స్లీపర్ లేదా ఏసీ త్రీ టైర్ క్లాసులో మాత్రమే సామాన్య ప్రయాణికులతో కలిసి ప్రయాణించాలని రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అధికారులు తమ స్వంత ఖర్చులతో ఎగ్జిక్యూటివ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 

 

Trending News