భారతీయ రైల్వే ( Indian Railways ) అరుదైన ఘనత సాధించనుంది. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేక రైలును ప్రారంబిస్తోంది. ఆగస్టు 7న ఈ ప్రత్యేక రైలు పట్టాలకెక్కనుంది.
ఇండియన్ రైల్వేస్ అంటేనే ఓ ప్రత్యేకత. ఎప్పుడూ ఏదో ప్రత్యేకత సాధిస్తుంటుంది. ఇప్పుడు రైతుల కోసం ప్రత్యేక రైలు ప్రవేశపెడుతోంది. అదే కిసాన్ రైలు ( kisan train ). రేపు అంటే ఆగస్టు 7న ఈ తొలి కిసాన్ రైలు పట్టాలకెక్కనుంది. మహారాష్ట్ర ( Maharashtra ) లోని దేవ్లాలి నుంచి బీహార్ ( Bihar ) లోని దానపూర్ వరకూ నడిచే తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ లు ( Railway minister piyush goel ) ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కిసాన్ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. వారానికోసారి నడిచే ఈ రైలు ఉదయం 11 గంటలకు దేవ్లాలిలో బయలుదేరి..మరుసటి రోజు సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు దానాపూర్ చేరుతుంది. 1519 కిలోమీటర్ల దూరాన్ని 32 గంటల్లో పూర్తి చేసుకుంటుంది. త్వరగా పాడయ్యే ఉత్పత్తులైన పాలు, మాంసం, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తుల్నివేగవంతంగా రవాణా చేసే ఉద్దేశ్యంతో ఈ కిసాన్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. Also read: Lebanon blast: ఆ అమ్మోనియం నైట్రేట్ సేఫ్..చెన్నైకు ప్రమాదం లేదు
खुशहाल किसान, समृद्ध राष्ट्र: प्रधानमंत्री @NarendraModi जी के किसानों की आय दुगनी करने के प्रयास में कल महाराष्ट्र के देवलाली से बिहार के दानापुर के बीच पहली किसान रेल चलाई जा रही है।
जल्दी ख़राब होने वाले उत्पादों को किसान इस ट्रेन की मदद से भेज सकेंगे। https://t.co/OaWIKNjGuw pic.twitter.com/hsnj2vJjU6
— Piyush Goyal (@PiyushGoyal) August 6, 2020