India Corona Update: ఇండియాలో కరోనా సంక్రమణ ఇంకా కొనసాగుతోంది. గత 3-4 రోజుల్నించి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా 50-60 శాతం కేసులు ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తున్నాయి.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)తగ్గుముఖం పట్టిందనుకునేలోగా మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా సంక్రమణ మరోసారి ఊపందుకుంటోంది. గత 24 గంటల్లో దేశంలో 14 లక్షల 19 వేల 9 వందల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేయగా..42 వేల 909 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో 60-70 శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే ఉండటం ఆందోళన కల్గిస్తోంది. కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 29 వేల 836 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 3 కోట్ల 27 లక్షల 37 వేల 939 మందికి కరోనా వైరస్ సోకింది. అటు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 380 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకూ అంటే కరోనా సంక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 4 లక్షల 38 వేల 210 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో దేశంలో 34 వేల 763 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 3 కోట్ల 19 లక్షల 23 వేలమంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 76 వేల 324 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జాతీయస్థాయిలో కరోనా రికవరీ రేటు 97.51 శాతం కాగా, వీక్లీ పాజిటివ్ రేటు 2.41 శాతంగా ఉంది. అటు రోజువారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో ఇప్పటి వరకూ 63 కోట్ల 43 లక్షలమందికి కోవిడ్ వ్యాక్సిన్(Covid Vaccine)ఇచ్చారు.
Also read: Talibans on India: ఇండియాతో వాణిజ్య, రాజకీయ సంబంధాలు కావాలి : తాలిబన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook