Corona update: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు... 600లకు పైగా మరణాలు

Corona update: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కేరళను వదలట్లేదు. ఇండియాలో వెలుగుచూసిన మెుత్తం కొత్త కేసుల్లో దాదాపు 65 శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే బయటపడటం ఆందోళనకు గురిచేస్తోంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2021, 01:58 PM IST
  • దేశంలో మళ్లీ కరోనా జోరు
  • ఒక్క కేరళలోనే 24 వేలకుపైగా కేసులు నమోదు
  • వైరస్ తో కొత్తగా 648 మంది మృతి
Corona update: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు... 600లకు పైగా మరణాలు

Corona update: ఇండియాలో కొత్తగా 37,593 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,25,12,366కి చేరింది. వైరస్ తో కొత్తగా 648 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,35,758కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.09 శాతంగా ఉంది. 

దేశంలో తాజాగా 34,169 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,17,54,281కి చేరింది. రికవరీ రేటు (Recovery Rate) 97.7 శాతానికి పెరిగింది. ప్రస్తుతం భారత్‌(India)లో 3,22,327 యాక్టివ్ కేసులు(Active Cases) ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,92,755 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 51 కోట్ల 11 లక్షల 84 వేల 547 టెస్టులు చేశారు. కొత్తగా 61,90,930 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 59 కోట్ల 55 లక్షల 04 వేల 593 టీకా డోసులు(Vaccine) పంపిణీ చేశారు.

Also Read: Vaccine Slot Booking: వాట్సప్ నుంచి వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ ఎలాగో తెలుసా..

తాజా కేసుల్లో 64.6శాతం కేసులు ఒక్క కేరళ(Kerala)లోనే నమోదయ్యాయి. నిన్న ఆ రాష్ట్రంలో 24,296 కొత్త కేసులు వెలుగుచూశాయి. మే 26(28,798 కేసులు) తర్వాత కేరళలో 24వేల పైన కేసులు నమోదవడం మళ్లీ ఇప్పుడే. నిన్న దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర(Maharastra)లో కొత్త మరణాలు 288  నమోదవ్వగా... కేరళలో 173 మంది మృతి చెందారు.  ప్రస్తుతం 9 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో టెస్టుల పాజిటివిటీ రేటు(positivity Rate) 2.10 శాతంగా ఉంది. టెస్టుల పాజిటివిటీ రేటు దేశంలోనే ఎక్కువగా కేరళలో 16.35 శాతం ఉండగా... మణిపూర్‌లో 11.12 శాతం, సిక్కింలో 10.32 శాతం ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News