Corona Cases in India: దేశంలో కరోనా కేసులు(Coronavirus update) భారీగా పెరిగాయి. నిన్న14 వేలుగా ఉన్న కేసులు అమాంతం పెరిగి 18 వేలకు చేరాయి. దాంతో క్రియాశీల కేసుల(Active cases) తగ్గుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం రికవరీల కంటే కొత్త కేసులే అధికంగా ఉన్నాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు గణాంకాలను వెల్లడించింది.
బుధవారం 12,47,506 మందికి నిర్ధారణ పరీక్షలు(Corona Tests) నిర్వహించగా.. 18,454 మందికి వైరస్(Coronavirus) పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కొత్త కేసుల్లో 26 శాతం మేర పెరుగుదల కనిపించింది. నిన్న 17,561 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.41 కోట్లకు చేరగా.. అందులో 3.34 కోట్ల మందికి పైగా వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,78,831కి చేరింది. క్రియాశీల రేటు 0.52 శాతానికి చేరగా.. రికవరీ రేటు(Recovery Rate) 98.15 శాతం ఉంది. నిన్న మరో 160 మంది ప్రాణాలు(covid Deaths) కోల్పోయారు. ఇప్పటి వరకు 4.52 లక్షల మరణాలు సంభవించాయి.
Also read: 100 crore COVID-19 vaccination: నేడు 100 కోట్ల డోసులకు చేరనున్న కోవిడ్ వ్యాక్సినేషన్
100కోట్ల టీకాల పంపిణీ
జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా(Covid-19 Vaccination) కార్యక్రమం నేడు కీలక మైలురాయి చేరుకుంది. ఈ రోజు ఉదయం కల్లా 100 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ రికార్డును పురస్కరించుకుని కేంద్రం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
వరల్డ్ వైడ్..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 4,52,993 మందికి వైరస్ (Corona update) సోకింది. కొవిడ్ ధాటికి మరో 7,494 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,27,78,434 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,37,019 కు పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి