India Corona Tests: 5 కోట్ల మార్క్ దాటిన కరోనా పరీక్షలు

దేశంలో కరోనా పరీక్షలు 5 కోట్ల మార్క్ దాటాయి.  అటు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42 లక్షలు దాటగా...33 లక్షల మంది ఇప్పటికే కోలుకున్నారు.

Last Updated : Sep 9, 2020, 01:39 PM IST
India Corona Tests: 5 కోట్ల మార్క్ దాటిన కరోనా పరీక్షలు

దేశంలో కరోనా పరీక్షలు 5 కోట్ల మార్క్ దాటాయి.  అటు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42 లక్షలు దాటగా...33 లక్షల మంది ఇప్పటికే కోలుకున్నారు.

కరోనా కేసుల సంఖ్య గత రెండ్రోజుల్నించి కాస్త తగ్గు ముఖం పట్టాయి. రోజుకు 80-90 వేల కేసుల నుంచి 75 వేలకు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకూ 42 లక్షల 80 వేల 422 పాజిటివ్ కేసులు నమోదు కాగా...33 లక్షల 23 వేల 950 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8 లక్షల 83 వేల 697 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు రికవరీ రేటు కూడా క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలోని రికవరీ రేటు 77.65 శాతానికి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 1133 మంది మరణించగా..ఇప్పటివరకూ 72 వేల 775 మంది కరోనాకు బలయ్యారు. మరణాల రేటు మాత్రం 1.7 శాతంతో స్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 5 కోట్ల మార్క్ ను దాటాయి. ఇప్పటివరకూ దేశంలో 5 కోట్ల 6 లక్షల 80 వేల పరీక్షలు నిర్వహించారు. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే దాదాపు 62 శాతం కేసులున్నాయి. ప్రతి పది లక్షల మందిలో 36 వేల 703 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Trending News