Independence Day Offer: టాటా గ్రూప్‌కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ విస్తారా ఆకర్షణీయమైన ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. రక్షాబంధన్ నుంచి దీపావళి వరకూ ప్రయాణించేందుకు వీలుగా ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఇది. స్వాతంత్య్ర దినోత్సం పురస్కరించుకుని విస్తారా ఫ్రీడమ సేల్ ప్రారంభించింది.
రేపు పంద్రాగస్టు 78వ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ సందర్భంగా టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా ప్రత్యేక ఫ్రీడమ్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ రేపటి వరకు అంటే ఆగస్టు 15 వరకే అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 19 వరకూ లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు కూడా ఈ ఆఫర్ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు రేపటి లోగా టికెట్స్ బుక్ చేసుకుంటే ఆక్టోబర్ 31 వరకూ ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. అంటే రక్షాబంధన్ నుంచి దీపావళి వరకూ ఆఫర్ వర్తిస్తుంది. అక్టోబర్ 31 వరకూ ఎప్పుడైనా సరే రేపటి వరకూ టికెట్ బుక్ చేసుకుంటే చాలా తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ లభిస్తుంది.
ఈ ఆఫర్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రెండింటికీ వర్తిస్తుంది. డొమెస్టిక్ అయితే వన్ వే టికెట్ దేశంలో ఎక్కడికైనా సరే కేవలం 1578 రూపాయలు వెళ్లవచ్చు. అదే ఇంటర్నేషనల్ టికెట్ అయితే ఎక్కడికైనా కేవలం 11,978 రూపాయలకు వెళ్లవచ్చు. ఆగస్టు 15 వరకూ బుక్ చేసుకోవాలి. అక్టోబర్ 31 వరకూ ప్రయాణం చేయవచ్చు.
Celebrating India’s 78th Independence Day with the Freedom Sale!
Domestic one-way fares start at INR 1578 & International return fares start at INR 11978 all-in.
Book until 15-August-2024 for travel until 31-October-2024.— Vistara (@airvistara) August 9, 2024
అంటే దేశంలో ఎక్కడికైనా సరే ఎకానమీ, ప్రీమియం ఎకానమ, బిజినెస్ తరగతుల్లో కేవలం 1578 రూపాయలకే ప్రయాణించవచ్చు. ఇందులో డొమెస్టిక్ ప్రయాణీకులకు ఎకానమీ తరగతి టికెట్ 1578 రూపాయలు, ప్రీమియం ఎకానమీ అయితే 2678 రూపాయలు, బిజినెస్ కేటగరీలో 9978 రూపాయలు టికెట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై కూడా ఆఫర్ ఉంది. ఢిల్లీ నుంచి ఖాట్మండూకు ఎకానమీ టికెట్ 11,978 రూపాయలు, ప్రీమియం ఎకానమీలో 13,978 రూపాయు, బిజినెస్ తరగతిలో 46,978 రూపాయలు ఉంది. మరెందుకు ఆలస్యం..దీపావళి వరకూ ఎప్పుడైనా సరే దసరా సెలవులు, దీపావళి సెలవులు ఎంజాయ్ చేసేందుకు మంచి అవకాశం. రేపటి వరకూ టికెట్ బుక్ చేసుకుని సెలవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేయండి..
Also read: NEET UG 2024 Registration: నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రారంభం, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook