Income Tax Refund Updates: మీకు ఇన్‌కంటాక్స్ రిఫండ్ ఇంకా అందలేదా, కారణం ఏమై ఉంటుందో తెలుసా

Income Tax Refund Updates: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ గడువు ముగిసి రెండు నెలలు పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకు చాలామందికి రిఫండ్ కూడా వచ్చేసింది. ఇంకా ఎవరికైనా రిఫండ్ రాకపోతే కారణం అదే అయి ఉంటుంది. మరి ఏం చేయాలి. ఇప్పుడేమైనా అవకాశం ఉందా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 14, 2024, 04:54 PM IST
Income Tax Refund Updates: మీకు ఇన్‌కంటాక్స్ రిఫండ్ ఇంకా అందలేదా, కారణం ఏమై ఉంటుందో తెలుసా

Income Tax Refund Updates: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ప్రతి ట్యాక్స్ పేయర్ తప్పనిసరిగా సమర్పించాల్సిందే. జూలై 31తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు ముగిసింది. ప్రస్తుతం జరిమానాతో మాత్రమే డిసెంబర్ 31 వరకు అవకాశముంది. జూలా 31లోగా రిటర్న్స్ ఫైల్ చేసుంటే ఇప్పటికే రిఫండ్ అంది ఉండాలి. ఒకవేళ రిఫండ్ ఇంకా అంది ఉండకపోతే ఏం చేయాలో, కారణం ఏమై ఉంటుందో తెలుసుకుందాం.

ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ సకాలంలో పైల్ చేసి ఉండి ఇప్పటికే రిఫండ్ అందని వాళ్లు చాలామంది ఉండే ఉంటారు. రిఫండ్ ఇప్పటికీ రాకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. మీరు రిటర్న్స్ ఫైల్ చేసి ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి కాకపోతే రిఫండ్ రాకపోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఇతర కారణాలు ఉన్నాయి. రిఫండ్ రిలీజ్ చేసేముందు ఇన్‌కంటాక్స్ శాఖ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటుంది. ఎందుకంటే గత కొద్దికాలంగా ఫేక్ రిటర్న్స్ పెరిగిపోతున్నాయి. వీటినిక చెక్ పెట్టేందుకు ఇన్‌కంటాక్స్ శాఖ రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. 

మీ రిఫండ్ ఇంకా రాలేదా

మీ ఐటీ రిటర్న్స్‌ను ఇన్‌కంటాక్స్ శాఖ రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ చెక్ చేసుంటే మీకు మెయిల్ వస్తుంది. ఇన్‌కంటాక్స్ ఇ పోర్టల్‌లో కూడా అందుకు సంబంధిచిన సమాచారం చూడవచ్చు. మీ రిటర్న్స్ రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పరిథిలో చెక్ చేసుంటే ఈ సమస్యను మీరు పరిష్కరించనంతవరకు రిఫండ్ పరిశీలించరు. మీరు స్పందించకపోతే ఇన్‌కంటాక్స్ శాఖ మీకు నోటీసు పంపిస్తుంది. 

గత కొద్దికాలంగా ఇన్‌కంటాక్స్ ట్యాక్స్ శాఖకు నకిలీ రిటర్న్స్,ఫేక్ రిఫండ్ క్లెయిమ్స్ పెరిగిపోతున్నాయి. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకే డిపార్ట్‌మెంట్ రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో తీసుకొచ్చింది. మీ రిటర్న్స్ ఈ పరిధిలో వస్తే మీరు ఈ క్లెయిమ్‌ను నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఇన్‌కంటాక్స్ తగిన ప్రక్రియ మొదలు పెడుతుంది. 

ఇన్‌కంటాక్స్ శాఖ వెబ్‌సైట్ లాగిన్ అయిన తరువాత పెండింగ్ యాక్షన్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఫర్ యువర్ యాక్షన్ అని ఉంటుంది. మీ స్పందన తెలిపేందుకు ఈ పోర్టల్ లాగిన్ కావాలి. పెండింగ్ యాక్షన్ విభాగంలో సరైన ఆప్షన్ ఎంచుకోవాలి. 

Also read: Aadhaar Card Updates: ఆధార్ కార్డులో ఫోటో, అడ్రస్ సులభంగా మార్చుకునే పద్ధతి ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News