HRD ministry: ఆన్‌లైన్ క్లాసెస్‌కి కేంద్రం కండిషన్స్

Online classes: న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా బ్రేకులు పడకపోగా.. ఏరోజుకు ఆరోజు నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ( Coronavirus ) నమోదవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయోననే విషయంలో ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చేలా లేదు.

Last Updated : Jul 14, 2020, 10:20 PM IST
HRD ministry: ఆన్‌లైన్ క్లాసెస్‌కి కేంద్రం కండిషన్స్

Online classes: న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా బ్రేకులు పడకపోగా.. ఏరోజుకు ఆరోజు నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ( Coronavirus ) నమోదవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయోననే విషయంలో ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చేలా లేదు. దీంతో దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు ( Educational institutions ) ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాయి. వాస్తవానికి ఆన్‌లైన్ తరగతులపై ఇదివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి మార్గదర్శకాలు జారీచేయలేదు. కానీ కొన్ని విద్యా సంస్థలు మాత్రం పోటాపోటీగా రెండు, మూడు గంటలు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇంకొన్ని విద్యా సంస్థలు ఆన్‌లైన్ తరగతుల పేరిట ఎప్పటిలాగే ఫీజులు ( Fee ) వసూలు చేస్తుండటంతో పాటు ల్యాప్‌టాప్‌లు ( Laptops ) కొనుగోలు చేయాలని, ఇంటర్నెట్ కనెక్షన్ ( Internet connection ) తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్నాయి. దీంతో విద్యా సంస్థల ఆగడాలను భరించలేక పలువురు కోర్టులను సైతం ఆశ్రయించారు. ( Also read: Covid19: ఇండియాలో పెరుగుతున్న రికవరీ రేటు )

తాజాగా ఈ వివాదంపై స్పందించిన కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ.. ఆన్‌లైన్ తరగతులకు సంబంధించిన మార్గదర్శకాలను ( Online classes guidelines ) విడుద‌ల చేసింది. విద్యార్థులకు గంట‌ల త‌ర‌బ‌డి ఆన్‌లైన్ క్లాసులు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టంచేసిన కేంద్రం.. విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా స్క్రీన్‌ టైమ్ కుదించాల‌ని పేర్కొంది. ప్రీ ప్రైమరీ విద్యార్థులు అదే పనిగా స్క్రీన్ చూస్తే.. వారి కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉందని భావించిన కేంద్రం.. వారికి రోజులో 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించరాదని తేల్చిచెప్పింది. ( Also read: Tips To Use Sanitizer: శానిటైజర్‌ను ఎలా వాడాలో తెలుసా ? )

అలాగే, 1 నుంచి 8వ తరగతుల విద్యార్థుల‌కు 45 నిమిషాలకు ఒక సెషన్ చొప్పున ( Online session ) రోజుకు 2 సెషన్స్ తీసుకోవచ్చని తెలిపింది. 9 నుంచి 12వ తరగతుల విద్యార్థుల‌కు 30-45 నిమిషాలతో ఒక సెషన్ చొప్పున‌ మొత్తం నాలుగు సెషన్‌లు మించ‌కుండా ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ( Ramesh Mokhriyal Nishank ) మార్గదర్శకాలు విడుదల చేశారు. Also read: Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్‌లో మరో వ్యాధి కలకలం

Trending News