Heavy Rains: ముంబైలో భారీ వర్షాలు..సంద్రంగా మారిన రోడ్లు

దేశ ఆర్ధిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అల్లాడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా వణికిన ముంబై నగరం ఇప్పుడు వరద ముప్పెట చిక్కుకుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి..

Last Updated : Aug 5, 2020, 10:39 AM IST
Heavy Rains: ముంబైలో భారీ వర్షాలు..సంద్రంగా మారిన రోడ్లు

దేశ ఆర్ధిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అల్లాడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా వణికిన ముంబై నగరం ఇప్పుడు వరద ముప్పెట చిక్కుకుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి..

మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత 24 గంటల్నించి భారీ వర్షాలు కరుస్తున్నాయి. ముంబైతో పాటు ధాణే, రాయ్ గడ్ జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు మరో రెండ్రోజుల వరకూ పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలకు తోడు..అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత 28 గంటల్లో ముంబై పరిసర ప్రాంతాల్లో 25.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. భారీ వర్షాల కారణంగా ముంబై సంద్రంలా మారింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమాన ఉన్న తాపీ, తద్రీ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అటు గోదావరి, దమనగంగ నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

ముంబై, ధాణేలలో ఎక్కడ ఎటు చూసినా వరద నీరే కన్పిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే గత 12 గంటల్నించి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. భారీవర్షాల కారణంగా అన్ని ప్రాంతాలు జలమయం కావడంతో ఏది రోడ్డు..ఏది డ్రైనేజ్ అనేది తెలియడం లేదు. పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగిపోయాయి. సముద్ర ప్రాంతం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేట మానేశారు. 

Trending News