47kg Tumour in Stomach: దేవుడా!! కడుపులో 47 కిలోల కణితి.. 18 ఏళ్లుగా నరకం!

47kg tumour removed from Gujarat Woman's stomach: గుజరాత్‌లోని అహ్మదాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు ఓ మహిళ కడుపులో 47 కిలోల కణితిని తొలగించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2022, 04:47 PM IST
  • మహిళ కడుపులో 47 కిలోల కణితి
  • 18 ఏళ్లుగా నరకం అనుభవించిన మహిళ
  • సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు
47kg Tumour in Stomach: దేవుడా!! కడుపులో 47 కిలోల కణితి.. 18 ఏళ్లుగా నరకం!

47kg tumour removed from Gujarat Woman's stomach: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ (56) కడుపు నుంచి 47 కిలోల కణితిని తొలగించారు వైద్యులు. కడుపులో ఆ కణితి కారణంగా 18 ఏళ్లుగా ఆ మహిళ నరకం అనుభవించింది. సర్జరీ తర్వాత ఆమె బరువు 49 కిలోలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అంటే.. ఇన్నేళ్లు దాదాపుగా ఆమె శరీర బరువుతో సమానమైన కణితిని  కడుపులో మోసింది. కడుపు నుంచి కణితిని తొలగించాక.. శరీరం ఒక్కసారిగా తేలికగా అయిన ఫీలింగ్ ఆమెకు కలిగిందని వైద్యులు తెలిపారు.

గుజరాత్‌లోని దేవ్‌గఢ్ బరియాకు చెందిన ఆ మహిళకు అహ్మదాబాద్‌లోని అపోలో ఆసుపత్రి వైద్యులు సర్జరీ నిర్వహించి కణితిని తొలగించారు. నిజానికి ఆ కణితి మొదట్లో అంత పెద్దగా లేదని ఆమె కుమారుడు వెల్లడించాడు. కానీ రాను రాను పొత్తి కడుపు అసాధారణంగా పెరుగుతూ వచ్చిందని తెలిపాడు. అయితే అది గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి తన తల్లి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడినట్లు చెప్పాడు. ఈ క్రమంలో 2004లో సోనోగ్రఫీ నిర్వహించగా.. పొత్తి కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. 

అదే ఏడాది కణితిని తొలగించుకునేందుకు వైద్యులను సంప్రదించగా.. అది శరీరంలోని కిడ్నీ, ఊపిరితిత్తులు ఇతర అవయవాలతో అతుక్కుని ఉన్నట్లు చెప్పారు. కాబట్టి దాన్ని తొలగించడం సాధ్యపడదని.. ఒకవేళ తొలగిస్తే ప్రాణాపాయం ఉంటుందని చెప్పారు. దీంతో సర్జరీ చేయలేదు. గడిచిన రెండేళ్లలో ఆ కణితి బెలూన్‌లా పైపైకి ఉబ్బుతూ వచ్చింది.

అప్పటినుంచి ఎంతోమంది వైద్యులను సంప్రదించిన ఆ కుటుంబం.. ఆ క్రమంలో అహ్మదాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. ఆమెకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన అక్కడి వైద్యులు ఎట్టకేలకు సర్జరీ ద్వారా విజయవంతంగా కణితిని తొలగించారు. మొత్తం 9 మంది వైద్య బృందం ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. సర్జరీ తర్వాత కొద్దిరోజులకు ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 

Also Read: Earwax Removal: ఇయర్ బడ్స్‌తో చెవిలో గులిమిని క్లీన్ చేయడం మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News