గుజరాత్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హరోహోరి పోరు నడుస్తోంది. కౌటింగ్ ప్రారంభమైన తొలి గంట వరకు బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది..ఆ తర్వాత అర్థగంటలో కాంగ్రెస్ ఒక్కసారిగా ఆధిక్యాన్ని కనబరిచి బీజేపీని వెనక్కి నెట్టేసింది. దీంతో పోరు నువ్వునేనా అనే స్థితిలోకి వచ్చింది. ప్రస్తుతం కమలం పార్టీ 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 88 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ప్రారంభానికి ముందు గుజరాత్‌లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే ఒక్కసారిగా గాలి కాంగ్రెస్‌వైపు మళ్లింది. దీంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రధానిపై చేసిన ‘నీచ్’ వ్యాఖ్యలతో వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారిపోయింది. గాలి మళ్లీ బీజేపీ వైపు మళ్లింది. ఇలా సాగిన పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది