CISF Recruitment 2022: సీఐఎస్‌ఎఫ్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. తెలంగాణ, ఏపీలో ఖాళీలు!

CISF Constable Jobs Notification: సీఐఎస్‌ఎఫ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీలో కూడా ఇందుకు సంబంధించిన ఖాళీలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 12:19 AM IST
  • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పోస్టులకు నోటిఫికేషన్
  • 1149 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
  • అర్హత కలిగినటువంటి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
  • మార్చి 4, 2022 వరకు గడువు
CISF Recruitment 2022: సీఐఎస్‌ఎఫ్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. తెలంగాణ, ఏపీలో ఖాళీలు!

CISF Jobs Latest Notofication: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్... సీఐఎస్‌ఎఫ్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 1149 కానిస్టేబుల్ / ఫైర్ (మేలు) పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగినటువంటి పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు  దరఖాస్తు చేసుకోవచ్చు. సీఐఎస్‌ఎఫ్‌ అఫీషియల్‌ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో www.cisfrectt.in ఈ పోస్టులకు లో అప్లై చేసుకోవొచ్చు. 

మొత్తం 1149 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్‌ సబ్‌మిట్ చేసేందుకు మార్చి 4, 2022 వరకు గడువు ఉంది. 

అభ్యర్థులు ఇంటర్మీడియల్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్‌‌ లెవెల్‌లో సైన్స్ సబ్జెక్ట్‌ కచ్చితంగా చదివి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్శిటీ నుంచి ఉత్తీర్ణులై ఉండాలి. 

వచ్చే నెల 4వ తేదీ నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లుగా ఉండాలి..  ఇక గరిష్టంగా 23 సంవత్సరాల వయసు మించి ఉండకూడదు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌తో పాటు ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌తో పాటు పలు పరీక్షలు నిర్వహిస్తారు. 

ఈ పోస్టులకు సంబంధించి తెలంగాణ, ఏపీలో కూడా ఖాళీలు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని నక్సల్స్ ఏరియాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉండే పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఇక తెలంగాణలో 30 పోస్టులు ఉండగా, ఏపీలో 79 పోస్టులు ఉన్నాయి.

Also Read: New NCA Building: నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి శంకుస్థాపన చేసిన గంగూలీ, జై షా

Also Read: Vijay Beast: విజయ్‌ 'బీస్ట్‌' నుంచి తొలి లిరికల్‌ సాంగ్‌ రిలీజ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News