Aadhaar Download: హుర్రే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్

హుర్రే..!! ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండా కూడా UIDAI అధికారిక వెబ్‌సైట్ నుండి ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ తో మొబైల్ నంబర్లు నమోదు చేసుకోని వారికి కోసం UIDAI ఈ చర్య తీసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 07:12 PM IST
  • UIDAI నుండి కొత్త అప్డేట్
  • ఇక రిజిస్టర్ మొబైల్ నంబర్ లేకుండానే ఆధార్ డౌన్‌లోడ్
  • ఆధార్ డౌన్‌లోడ్ కు ఇక ఎలాంటి ఓటీపీ అక్కర్లేదు
  • మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోని వారి కోసం ఈ ఆప్షన్
Aadhaar Download: హుర్రే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్

Download Aadhaar Card Without Registered Mobile Number: ఆధార్ కార్డు వినియోగదారులకు ఒక మంచి ఉపయోగకరమైన వార్త ఇది. నిజానికి ఆధార్ కార్డు డౌన్ లో డ్ చేసుకోవాలనుంటే.. రిజిస్టర్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.. అది ఎంటర్ చేస్తేనే ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.. కానీ ఇపుడు ఎలాంటి మొబైల్ నంబర్ లేకుండానే ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ UIDAI తీసుకొచ్చింది. 

ఎలాంటి ఓటీపీ లేకుండా ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చని.. ఆధార్‌ను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (The Unique Identification Authority of India) ఈ విషయాన్ని ప్రకటించింది. మొబైల్ నంబరు రిజిస్టర్ చేసుకొని ఆధార్ కార్డు ఉన్న వారి కోసం ఈ ఆప్షన్ తీసుకొచ్చింది. 

Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!

మొబైల్ నంబర్ లేకుండా ఆధార్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో ఆ పద్దతి గురించి ఇక్కడ వివరంగా తెలుపబడింది:

1. దీని కోసం మీరు ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి 'నా ఆధార్'పై నొక్కండి.

2. ఇప్పుడు 'ఆర్డర్ ఆధార్ PVC కార్డ్' పై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయమని అడుగుతుంది. 

4. ఇక్కడ మీరు ఆధార్ నంబర్‌కు బదులుగా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VID)ని కూడా నమోదు చేయవచ్చు.

5. ఈ ప్రక్రియ తర్వాత, మీకు ఇచ్చిన సెక్యూరిటీ లేదా క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.

Also Read: Mega Daughter Divorce Rumours: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విడాకులు..?? రూమర్లకు చెక్ పెట్టిన కళ్యాణ్ దేవ్

6. మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండా కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, 'నా మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయబడలేదు' అనే ఎంపికపై క్లిక్ చేయండి.

7. ఇప్పుడు మీ ప్రత్యామ్నాయ నంబర్ లేదా నమోదు చేయని మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

8. ఇప్పుడు 'Send OTP'పై క్లిక్ చేయండి.

9. ఇప్పుడు మీరు నమోదు చేసిన ప్రత్యామ్నాయ నంబర్‌పై వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది.

10. తర్వాత, మీరు 'నిబంధనలు మరియు షరతులు' చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి, చివరకు 'Submit'పై క్లిక్ చేయండి.

11. ఇప్పుడు వేరే కొత్త పేజీకి ఓపెన్ అవుతుంది.

12. రీప్రింటింగ్ యొక్క ధృవీకరణ కోసం, మీరు ఇక్కడ ఆధార్ లెటర్ ప్రివ్యూ ఎంపికను పొందుతారు.

13. దీని తర్వాత మీరు 'మేక్ పేమెంట్' ఎంపికను ఎంచుకోండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News