న్యూ ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి వెనుకున్న కారణాలను విశ్లేషించే పనిలో పడిన భారతీయ జనతా పార్టీ.. ఓటమికి దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. 'గోలీ మారో', 'ఇండో-పాక్ మ్యాచ్' వంటి వివాదాస్పద వ్యాఖ్యలే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి ఓటమి పాలవడానికి ఓ కారణమై ఉంటాయని అన్నారు. అటువంటి వివాదాస్పద వ్యాఖ్యల నుంచి పార్టీ కూడా దూరంగా ఉంటోందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ ఎన్నికల్లో గెలవడానికో లేదా ఓడిపోవడానికో బీజేపి పోటీ చేయలేదని... ఎన్నికల ద్వారా పార్టీ భావజాలాన్ని వ్యాపింప చేయడమే తమ పార్టీ లక్ష్యం అని అమిత్ షా స్పష్టంచేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఇలాంటి ప్రతికూల ఫలితం రావడం ఇదేమీ మొదటిసారి కాదు... గతంలోనూ అనేకసార్లు ప్రతికూల ఫలితాలు వచ్చిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ తాను అదే స్పూర్తితో పనిచేశానని.. తాను బీజేపి కార్యకర్తను కనుక బీజేపి సిద్ధాంతాలను వీలైనంత ఎక్కువ మందికి తెలియజేసేందుకు తన వంతు కృషి తాను చేశానని అమిత్ షా అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..