Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, షాకిచ్చిన వెండి

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గగా, ఢిల్లీలో ధరలు (Gold Rate Today In India) స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధర భారీగా పుంజుకుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Sep 8, 2020, 07:24 AM IST
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, షాకిచ్చిన వెండి

బులియన్ మార్కెట్‌లో గత వారంతంలో బంగారం ధరలు (Gold Rate Today) తగ్గాయి. నేడు సైతం బంగారం ధర తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గింది. వెండి మాత్రం భారీగా ధర పెరిగింది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.40 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,290కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,850 అయింది. Telangana Vro System: సంచలన నిర్ణయం.. తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు!

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) అతి స్వల్పంగా పెరిగాయి. తాజా రూ.40 మేర స్వల్పంగా బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,160కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,650 అయింది. AP Unlock 4 Guidelines: ఏపీలో అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా పెరిగింది. తాజాగా రూ.890 మేర  భారీగా ధర పుంజుకుంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.68,100కి చేరింది. వెండి ధర దేశ వ్యాప్తంగా ఇదే ఉంటుంది. Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు

Trending News