భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు జోరందుకున్నాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది. అంతార్జాతీయ అంశాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, చమురు ధరలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 13, 2020, 09:13 AM IST
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో ఈవారం బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. మరోవైపు వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.470 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,980కి ఎగబాకింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,940కి చేరింది. నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు పెరిగాయి.  బంగార ధర నేటి మార్కెట్‌లో రూ.500 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,910కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,700 అయింది.  బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్.. ఫొటో గ్యాలరీ

బంగారం ధరలకు కిలో వెండి ధర పోటీ ఇస్తుంది. నేడు బంగారంతో పాటు వెండి ధర సైతం భారీగానే పెరిగింది. నేడు వెండి ధర రూ.900 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.47,300కి చేరింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Trending News