మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి

బంగారం ధరలు(Gold Price Today) స్వల్పంగా తగ్గినా రూ.50 వేల మార్కును సైతం దిగిరావడం లేదు. మరోవైపు బులియన్ మార్కెట్‌లో వెండి కనిష్ట ధరలకు పతనమవుతోంది. నేడు ధర భారీగా తగ్గడంతో 10 రోజుల కనిష్ట ధరను వెండి నమోదు చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 29, 2020, 07:53 AM IST
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు(Gold Price Today) స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం భారీగానే దిగొచ్చాయి. హైదరాబాద్(Gold Price In Hyderabad)‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.190 మేర  బంగారం ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ50,370కి తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,160కి పడిపోయింది. నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్

ఢిల్లీలో మార్కెట్‌లో నేడు రూ.250 మేర ధర తరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,800 అయింది. అదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.190 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,060కి క్షీణించింది. Photos: జబర్దస్త్ యాంకర్ అనసూయ హొయలు

నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధర మాత్రం భారీగానే దిగొచ్చింది. వెండి పది రోజుల కనిష్ట ధరను నమోదు చేసింది. నేడు వెండి ధర రూ.850 మేర భారీగా తగ్గడంతో 1 కేజీ ధర రూ.47,600కి పడిపోయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

 

Trending News