Gold Price: తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి

నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం(Gold Price Today), వెండి ధరలు దిగొచ్చాయి. అయినా బంగారం ధర రూ.50వేల పైనే ట్రేడ్ అవుతోంది. అయితే వెండి ధరలు భారీ ధరలను ఇంకా అందుకోలేకపోతున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 24, 2020, 06:46 AM IST
Gold Price: తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు(Gold Price Today) దిగొచ్చాయి. వెండి ధర సైతం బంగారం బాటలోనే పయనించింది.  హైదరాబాద్(Gold Price In Hyderabad)‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.200 మేర  బంగారం ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,390కి దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,100 వద్ద ట్రేడ్ అవుతోంది.  Photos: అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ స్టిల్స్

ఢిల్లీలో నేటి మార్కెట్‌లో రూ.190 మేర తగ్గుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,000 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.46,800కు దిగొచ్చింది.  తమ జవాన్ల మరణాలపై నోరు విప్పిన చైనా

Silver Rate Today | బంగారం ధరలు తగ్గగా, వెండి ధర సైతం దిగొచ్చింది. రూ. 49వేల మార్కు చేరుకుంటుందనుకున్న వెండి ధర తగ్గింది. నేడు వెండి ధర రూ.300 మేర తగ్గడంతో 1 కేజీ ధర రూ.48,500కి పడిపోయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News