పాకిస్తాన్ వెళ్లి ముషారఫ్‌కి బానిసగా బతుకు: కాంగ్రెస్ నేతపై శివసేన ఫైర్

కాశ్మీరీలకు స్వాత్రంత్ర్యం ప్రసాదించి.. వారు స్వతంత్రంగా బతకేలా చూడాలని గతంలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ చేసిన మాటలను సమర్థించిన సీనియర్ కాంగ్రెస్ నేత సయిఫుద్దీన్ సోజ్ పై బీజేపీ, శివసేన నేతలు మండిపడ్డారు. 

Last Updated : Jun 23, 2018, 11:16 AM IST
పాకిస్తాన్ వెళ్లి ముషారఫ్‌కి బానిసగా బతుకు: కాంగ్రెస్ నేతపై శివసేన ఫైర్

కాశ్మీరీలకు స్వాత్రంత్ర్యం ప్రసాదించి.. వారు స్వతంత్రంగా బతకేలా చూడాలని గతంలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ చేసిన మాటలను సమర్థించిన సీనియర్ కాంగ్రెస్ నేత సయిఫుద్దీన్ సోజ్ పై బీజేపీ, శివసేన నేతలు మండిపడ్డారు. "కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సయిఫుద్దీన్ సోజ్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి. సోజ్‌కు అంతగా పాకిస్తాన్ పై ప్రేమ ఉంటే.. అదే ప్రాంతానికి వెళ్లి ముషారఫ్‌కి ఊడిగం చేసి బానిసగా బతకాలి" అని ఈ సందర్భంగా శివసేన నేత మనీషా కయండే హితవు పలికారు. సోజ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఫైర్ అయ్యారు.

ఆయన మాట్లాడుతూ "'సోజ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూతురిని వేర్పాటువాదులు కిడ్నాప్ చేస్తే పోలీసుల సహాయాన్ని పొందారు. ఇలాంటి వారికి సహాయం చేసి ఉపయోగం లేదు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వారికి మాత్రమే నివసించే హక్కు ఉంది. ఆయనకు అంతగా ముషారఫ్‌ని ఇష్టపడాలని ఉండే పాకిస్తాన్ వెళ్లిపోమనండి. మాకు అభ్యంతరం కూడా లేదు. కావాలంటే విమాన టిక్కెట్లు కూడా నేనే బుక్ చేస్తాను" అని సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. 

సోజ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత సంబిత్ పాత్రా కూడా స్పందించారు. కాంగ్రెస్ స్వయంగా ఈ వ్యాఖ్యలపై స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్. గతంలో గులామ్ నబీ ఆజాద్ కూడా ఇండియన్ ఆర్మీని దూషించే మాటలు మాట్లాడారని ఆమె గుర్తుచేశారు. అదేవిధంగా బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ, ఇలాంటి బాధ్యతారహితమైన మాటలు వేర్పాటువాదులకు,

తీవ్రవాదులకు ఊతమిస్తాయని.. నాయకులు ఇప్పటికైనా ఇలాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలని తెలిపారు. అసలు ఈ వివాదం తలెత్తడానికి కారణం "కాశ్మీర్:గ్లింప్సెస్ ఆఫ్ హిస్టరీ అండ్ ది స్టోరి ఆఫ్ స్ట్రగుల్" అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సోజ్ హాజరు కావడమే. ఇదే కార్యక్రమంలోనే సోజ్ తన ప్రసంగంలో ముషారఫ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన అభిప్రాయంలో కూడా నిజం ఉందని తెలిపారు. 

Trending News