వందసార్లు స్నానం చేసినా...గేదెలాగే ఉంటారు - సీఎం కుమారస్వామిపై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

కర్నాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామిపై బీజేపీ నేత రాజు ఖగే తీవ్ర వ్యాఖ్యలు

Last Updated : Apr 17, 2019, 05:34 PM IST
వందసార్లు స్నానం చేసినా...గేదెలాగే ఉంటారు - సీఎం కుమారస్వామిపై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

ఎన్నికల వేళ మాటల తూటాల్లా పేలుతున్నాయి. విధానపరమైన విమర్శలు పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలు..జాతి విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లారు. బీజేపీ సీనియర్ నేత రాజు ఖగే ఎన్నికల ప్రచారంలో  కర్నాటక సీఎం హెచ్ డీ కుమారస్వామి ఉద్దేశించి మాట్లాడుతూ ...ఆయన 100 సార్లు స్నానం చేసినా గేదెలాగే ఉంటారని ఎద్దేవ చేశారు. బీజేపీ నేత వ్యాఖ్యలపై జేడీఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. జాతీని ఉద్దేశించి ఇలాంటి విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోడీని విమర్శించినందుకేనా..?

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీపై కుమారస్వామి తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ మేకప్ వేసుకోవడం వల్లే ప్రధాని మోదీ ముఖం ప్రకాశవంతంగా ఉంటుందంటూ తీవ్ర విమర్శల చేశారు. మీడియా మందు మంచిగా కనిపించేందుకు మోదీ ప్రతి రోజు ముఖానికి 10 సార్లు పౌడర్ వేసుకుంటారని...10 డ్రస్సులు మార్చుతారని కుమారస్వామి ఎద్దేవ చేశారు.. ఈ నేపథ్యంలో బీజేపీ నేత రాజు  రాజు ఖగే ఈ విధంగా బదులిచ్చిచ్చారు

Trending News