ఆ రాష్ట్రంలో తొలి కరోనా మరణం.. టెన్షన్ మొదలైంది

దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కుప్పలుతెప్పలుగా నమోదవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ కేవలం పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్న గోవా రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది.

Last Updated : Jun 23, 2020, 09:53 AM IST
ఆ రాష్ట్రంలో తొలి కరోనా మరణం.. టెన్షన్ మొదలైంది

CoronaVirus Deaths in Goa | దేశంలో కరోనా వైరస్(CoronaVirus) మహమ్మారి రోజురోజుకు ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న గోవాలో తొలి కరోనా మరణం(First COVID19 Death In Goa) నమోదైంది. కరోనా బారిన పడ్డ 85 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. రాష్ట్రంలో ఇదే మొదటి కరోనా మరణమని గోవా ఆరోగ్యమంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు. గోవాలో ఇప్పటివరకు 818 కరోనా కేసులు నమోదయ్యాయి. చికిత్స తర్వాత 135 మంది కోవిడ్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 683మందికి చికిత్స అందిస్తున్నారు. తమ జవాన్ల మరణాలపై నోరు విప్పిన చైనా

సోమవారం రాత్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో 58 ఏళ్ల మరో వ్యక్తి కరోనాతో చనిపోయాడు. ఇలా ఒకే రోజు తొలి రెండు కరోనా మరణాలు గోవాలో నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. అక్కడ మొదటి మూడు కేసులు మార్చి 25న నమోదయ్యాయి. పర్యాటక ప్రాంతమైన గోవాకు లాక్‌డౌన్‌కు ముందు విదేశీ వీసాలు తాత్కాలికంగా నిలిపేవరకు విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండేది. అయినా కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు గోవా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్యమంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు. తమ జవాన్ల మరణాలపై నోరు విప్పిన చైనా

మొదటి స్థానంలో మహారాష్ట్ర
దేశంలో ఎక్కువ కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో దూసుకుపోతోంది. సోమవారం వరకు అక్కడ 1,35,796 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 6,283 మంది కరోనాతో మరణించారు. ఆర్థిక రాజధాని ముంబైలోనే 67,635 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా... తమిళనాడు మూడో స్థానంలో ఉంది. అక్కడ ఇప్పటివరకు 62,087 కేసులు నమోదు కాగా 794మంది మరణించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News