ఎన్నికల బాండ్లు వచ్చేస్తున్నాయ్ ..!!

రాజకీయ నిధుల సేకరణ విధానంలో పారదర్శకత తీసుకువచ్చేందుకు కేంద్రం కీలక ముందడుగు వేసింది.

Last Updated : Jan 8, 2018, 01:10 PM IST
ఎన్నికల బాండ్లు వచ్చేస్తున్నాయ్ ..!!

రాజకీయ నిధుల సేకరణ విధానంలో పారదర్శకత తీసుకువచ్చేందుకు కేంద్రం కీలక ముందడుగు వేసింది. భారతీయ స్టేట్ బ్యాంకు ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ ను జారీ చేయాలని నిర్ణయించింది. విరాళాలు ఇవ్వాలనుకొనేవారు తొలుత వీటిని కొనుక్కోవాలి. రాజకీయ పార్టీలు అధీకృత బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే నగదు రూపంలో మార్చుకోవడానికి వీలవుతుంది. ప్రతిఏడాది జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ మాసాల్లో వీటిని నిర్దేశిత ఎస్బీఐ ఖాతాల్లో అందుబాటులో ఉంచుతారు. వెయ్యి, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల పరిమాణంలో ఎన్నికల బాండ్లు ఉండనున్నాయి.

ఈ బాండ్లు 15 రోజులు చెల్లుబాటు అవుతాయి. దాత పేరు ఇందులో పేర్కొనరు. అయితే బాండ్ కొనుగోలుదారు తన వివరాలను బ్యాంకుకు తెలియజేయాల్సి వస్తుంది. వీటికి ఎటువంటి వడ్డీ చెల్లించరు. దాత ఇచ్చిన నగదు.. రాజకీయ పార్టీలకు చెల్లించే వరకు బ్యాంకు రక్షణగా ఉంటుందని చెప్పారు. ఈ  విరాళాలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఐటీ రిటర్నులు సమర్పించవలసి ఉంటుంది. కాగా ఆదివారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాజకీయ విరాళాల ప్రక్షాళనకు అంతా సిద్ధం.. ఎవరైనా సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు అని చెప్పారు. ఈ బాండ్లు ఎందుకు అవసరమో వివరించారు.

Trending News