న్యూ ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సౌకర్యవంతమైన మెజారిటీ సాధిస్తారని అంచనా వేశాయి. గత ఐదేళ్ళలో ఆప్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలపై సాగించిన ఎన్నికల ప్రచారానికి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం వహించారు.
కాసేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మూడింట రెండొంతుల ఆధిక్యత లభిస్తుందని తెలుస్తోంది. దీంతో కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి తీవ్రంగా ఎత్తుగడలు వేసిన బీజేపీ ప్రయత్నించినా ఆ పార్టీకి ఫలితం దక్కకపోవడం లేదు.
ఒకటిన్నర దశాబ్దాలపాటు ఢిల్లీని ఏకధాటిగా పరిపాలించిన కాంగ్రెస్ మరోసారి తీవ్రంగా దెబ్బతినబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి.
ఏబిపి న్యూస్-సీ ఓటర్
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఏబిపి న్యూస్-సీఓటరు ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఆప్ పార్టీ కనీసం 49 సీట్లు, గరిష్టంగా 63 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ, 05-19 మధ్య స్థానాలు ఉంటాయని పేర్కొన్నాయి. ఇతర ఎగ్జిట్ పోల్స్ , కాంగ్రెస్ గరిష్టంగా నాలుగు సీట్లతో మూడవ స్థానంలో ఉంటుందని పేర్కొన్నాయి
న్యూస్ ఎక్స్- పోల్ స్టార్ట్
న్యూస్ఎక్స్-పోల్‌స్ట్రాట్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్‌లో ఆప్‌కు 50-56 సీట్లు, బీజేపీకి 10-14 సీట్ల మధ్య అంచనా వేసింది.
రిపబ్లిక్-జాన్ కి బాత్ ఎగ్జిట్ పోల్స్
రిపబ్లిక్-జాన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్, ఆప్, 48-61 సీట్లు, బీజేపీ 9-21 సీట్ల మధ్య గెలుపు అవకాశాలుంటాయని అంచనా వేసింది. కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
టైమ్స్ నౌ-ఐపిఎస్ఓఎస్
టైమ్స్ నౌ-ఐపిఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్, ఆమ్ ఆద్మీ పార్టీకి 44 సీట్లు, బీజేపీ 26 సీట్లు గెకిచ్చే అవకాశముందని అంచనా వేసింది. మరోవైపు కాంగ్రెస్ తన ఖాతా తెరవదని అంచనా వేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..