'మోదీకి దగ్గరగా ఎవ్వరినీ రానీయొద్దు.. మంత్రులనైనా..'

ఉగ్రవాదులు, మావోయిస్టుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి ముప్పు పొంచి ఉందని.. అన్ని రాష్ట్రాలను ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.

Last Updated : Jun 26, 2018, 05:55 PM IST
'మోదీకి దగ్గరగా ఎవ్వరినీ రానీయొద్దు.. మంత్రులనైనా..'

ఉగ్రవాదులు, మావోయిస్టుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి ముప్పు పొంచి ఉందని.. అన్ని రాష్ట్రాలను ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. రాష్ట్రాల్లో మోదీ పర్యటించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ప్రధాని పర్యటన సమయంలో రోడ్ షోలు నిర్వహించవద్దని, ఎవరినీ దగ్గరికి రానివ్వొద్దని.. అధికారులు, మంత్రులైనా భద్రతా సిబ్బంది అనుమతి తీసుకొనే మోదీని కలిసేలా చూడాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు రేఖ రాసింది.

2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసాంఘిక శక్తులు  ప్రధాని మోదీనే టార్గెట్ చేసుకున్నారని జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఇటీవల నక్సలైట్ల నుంచి మోదీకి ముప్పు ఉందని ఓ లేఖ ద్వారా విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రోడ్‌షోల సమయంలో మోదీ హత్యకు కుట్ర పన్నారని ఇటీవల పుణె పోలీసులు ఆరోపించారు.

మోదీ భద్రతా సిబ్బందికి కూడా హోంశాఖ ప్రత్యేక సూచనలిచ్చింది. అవసరం లేకుండా మోదీకి దగ్గరగా ఎవ్వరినీ రానీయొద్దని చెప్పారు. మోదీ ప్రజలకు దగ్గరగా వెళ్లే సందర్భాలను కూడా తగ్గించాలని హోంశాఖ భావిస్తోంది. మరోవైపు ఎల్లప్పుడూ ప్రధాని చుట్టూ ఉండే కమెండోలను కేంద్ర హోంశాఖ పె పెంచనుంది.

Trending News