ధోనికే తప్పని 'ఆధార్' ప్రైవసీ సమస్య..!

భారత పౌరుల ఆధార్ సంఖ్యలను కొందరు ప్రైవేటు ఆపరేటర్లు సేకరించి అధిక మొత్తానికి వేరే ఏజెన్సీలకు అమ్ముకుంటున్నారని వార్తలు వస్తున్న క్రమంలో అదే అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. 

Last Updated : Jan 19, 2018, 11:11 AM IST
ధోనికే తప్పని 'ఆధార్' ప్రైవసీ సమస్య..!

భారత పౌరుల ఆధార్ సంఖ్యలను కొందరు ప్రైవేటు ఆపరేటర్లు సేకరించి అధిక మొత్తానికి వేరే ఏజెన్సీలకు అమ్ముకుంటున్నారని వార్తలు వస్తున్న క్రమంలో అదే అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. పౌరుల ప్రైవసీని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందా? లేదా? అని ఘాటుగా ప్రశ్నించింది. అయితే ఇదే అంశంపై గతంలో ఆధార్ కార్డులు ప్రచురించే సంస్థ యూఐడిఏఐ వివరణ ఇచ్చింది. తమ భద్రతా వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉంటుందని.. పౌరుల ప్రైవసీకి ఎలాంటి విఘాతం కలగకుండా ఆధార్ పనిచేస్తోందని తెలిపింది.

ఈ విషయంపై జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ "ఆధార్ నెంబర్లు బహిర్గతమై పౌరుల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయన్నది వాస్తవమైన విషయం. భారతజట్టు కెప్టెన్ ధోనికి కూడా ఈ సమస్య తప్పలేదు. ఆయన ఆధార్ నెంబరు కూడా పబ్లిక్‌కి బహిర్గతమైంది. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించాలి" అని తెలిపారు. 

Trending News