Encounter with Naxalites in Narayanpur: ఛత్తీస్ గఢ్ దండకారుణ్యం తుపాకుల మోతతో మరోసారి దద్దరిల్లింది. నారాయణ్ పూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో 7 మంది నక్సలైట్ల మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సలైట్లు మరణించారు. సెర్చ్ ఆపరేషన్‌లో ఇప్పటివరకు యూనిఫారం ధరించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి సుందర్‌రాజ్ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు.
యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా ఛత్తీస్ ఘఢ్ లో ని నారాయణ్ పూర్, దంతెవాడ, జగదల్ పూర్, కొండగావ్ జిల్లాల భద్రతా సిబ్బంది బస్తర్ జిల్లా పరిధిలోని అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. డీఆర్ జీ, ఎస్ టీఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో దండకారుణ్యంలో కూంబింగ్ చేస్తున్న సమయంలో భద్రతాబలగాలపైకి మావోయిస్టులు కాల్పలకు దిగడంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపాయి.
తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 12 మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారని..ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
🚨 BIG ACTION by Security Forces 🎯
7 Naxalites has been ELIMINATED in an Encounter by Security forces in Narayanpur's Chhattisgarh 🔥 pic.twitter.com/x0DwQLzRyr
— Megh Updates 🚨™ (@MeghUpdates) December 12, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.