Sikkim Earthquake: సిక్కింలో భూకంపం.. రిక్టార్ స్కేలుపై 3.7 తీవ్రత నమోదు..

Sikkim Earthquake: సిక్కింలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టార్ స్కేలుపై 3.7 తీవ్రత నమోదైంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 01:34 PM IST
  • సిక్కింలో స్వల్ప భూకంపం
  • రిక్టార్ స్కేలుపై 3.7 తీవ్రత
  • భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు
Sikkim Earthquake: సిక్కింలో భూకంపం.. రిక్టార్ స్కేలుపై 3.7 తీవ్రత నమోదు..

Sikkim Earthquake: దేశంలో ఈ మధ్య భూకంపాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. తాజాగా బుధవారం సిక్కింలోని (Sikkim) రావంగ్లాలో రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. తెల్లవారు జామున 3.01 గంటల సమయంలో భూమి కంపించిందని పేర్కొంది. 

సిక్కింలోని రావంగ్లా (Ravangla) ప్రాంతానికి ఉత్తరాన 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్‌సీఎస్‌ (National Center for Seismology) అధికారులు పేర్కొన్నారు. రావంగ్లాలోని భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతున ఈ భూప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించారు. తెల్లవారుజాము సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో...ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తినష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 

Also Read: Earthquake in Srikakulam: శ్రీకాకుళంలో భూకంపం.. అంతా నిద్రలో ఉన్న వేళ.. భయంతో జనం పరుగులు..

ఏపీలో భూకంపం
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం (జనవరి 4) రాత్రి భూకంపం (Earthquake in Srikakulam) సంభవించింది. రాత్రి 10గంటల తర్వాత ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జనం భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. వారం రోజుల వ్యవధిలో రెండోసారి భూప్రకంపనలు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News