SBI ATM Franchise Business: చాలీ చాలని జీతంతో ఇబ్బంది పడుతున్నారా..?? టెన్షన్ పడకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా (SBI) ATM ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా నెలకు 60 వేల రూపాయకు సంపాదించే అవకాశం ఉంది. పూర్తీ వివరాలు తెలుసుకోండి.
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇంటి దగ్గర ఉండి పని చేసే వారికి కూడా చాలీ చాలని జీతంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఎస్‌బిఐ బ్యాంకు (SBI Bank) కొత్తగా ప్రవేశపెట్టిన కొత్త ఫ్రాంచైజ్ బిజినెస్ (ATM Franchise Business) ద్వారా ఇంటి నుండి సంపాదించే గొప్ప అవకాశం పొందవచ్చు. ఈ అవకాశం ద్వారా మీరు నెలకు 60 వేల రూపాయలు సంపాదించే గొప్ప వ్యాపార ఆలోచనను మీ ముందుకు తీసుకొచ్చాము. ఇది సురక్షితమైన పద్ధతిలో రాబడిని ఇచ్చే వ్యాపార పద్దతి.
Also Read: Pushpa Official Release Date: డిసెంబర్ 17న "పుష్ప" సినిమా విడుదల..ప్రకటించిన చిత్ర యూనిట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM ఫ్రాంచైజ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యొక్క ATM ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా మీరు సులభంగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. దేశంలో ఉన్న ఏ బ్యాంకు తరపున కూడా ATM ఇన్‌స్టాల్ చేయబడలేదు, కానీ దాని కోసం ప్రత్యేక కంపెనీ ఉంది. బ్యాంకు ద్వారా ఇవ్వబడిన ఈ కాంట్రాక్ట్ తో ప్రతిచోటా ATM లను ఇన్‌స్టాల్ చేయవచ్చు. కాబట్టి ATM ఫ్రాంచైజ్ బిజినెస్ తీసుకోవడం ద్వారా డబ్బును ఎలా సంపాదించవచ్చో ఇపుడు తెలుసుకుందాం.
SBI ATM ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఈ షరతులు తప్పనిసరి:
1. SBI ATM ఫ్రాంచైజీని పొందాలంటే, 50-80 చదరపు అడుగుల స్థలం ఉండాలి.
2. ఇతర ATM ల నుండి దాదాపు 100 మీటర్లు దూరం ఉండాలి.
3. ఈ స్థలం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలి మరియు మంచి మార్కెట్ ఏరియాలో ఉండాలి.
4. 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు, 1 kW విద్యుత్ కనెక్షన్ కూడా తప్పనిసరి.
5. ATM రోజుకి దాదాపు 300 లావాదేవీల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
6. ATM పై భాగం కాంక్రీట్ తో ఉండాలి.
7. V-SATని ఇన్‌స్టాల్ చేయడానికి లేదా ATM ఉన్న సొసైటీ నుండి నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (No-Objection certificate) తప్పనిసరి.
Also Read: Rashmika Mandanna: అండర్వేర్ యాడ్ ఎఫెక్ట్, రష్మికపై భారీగా ట్రోలింగ్
SBI ATM ఫ్రాంచైజ్ బిజినెస్ కోసం అవసరమైన పత్రాలు
1. ID ప్రూఫ్ - ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటరు కార్డ్
2. అడ్రస్ ప్రూఫ్ - రేషన్ కార్డ్, విద్యుత్ బిల్లు
3. బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పాస్‌బుక్
4. ఫోటోగ్రాఫ్, ఇ-మెయిల్ ఐడి, ఫోన్ నంబర్
5. ఇతర పత్రాలు
6. GST నంబర్
7. ఆర్థిక పత్రాలు
SBI ATM ఫ్రాంచైజ్ ఎలా అప్లై చేయాలి..??
SBI ATM ఫ్రాంఛైజింగ్ అందించే కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. టాటా ఇండికాష్ (Tata Indicash), ముత్తూట్ ఎటిఎం (Muthoot ATM) మరియు ఇండియా వన్ ఎటిఎమ్‌లు (India One ATM) మనదేశంలో ఎటిఎంలను ఇన్‌స్టాల్ చేయడానికి ఒప్పందాలను కలిగి ఉన్నాయి. దీని కోసం, మీరు కింద పేర్కొన్న అన్ని కంపెనీల వెబ్‌సైట్‌లలో ఆన్‌లైన్‌లో లాగిన్ చేయడం ద్వారా మీ ATM ఫ్రాంచైజ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: Google Alert: మెల్లగా పైసల్ గుంజుతున్న యాప్స్.. 136 యాప్స్ ను నిషేధించిన గూగుల్
అధికారిక వెబ్‌సైట్స్:
టాటా ఇండికాష్- https://indicash.co.in/
ముత్తూట్ ATM- www.muthootatm.com/suggest-atm.html
ఇండియా వన్ ATM- india1atm.in/rent-your-space
ఎంత సంపాదించవచ్చు..?
ATM ఫ్రాంఛైజింగ్ కంపెనీలలో టాటా ఇండికాష్ సంస్థ పురాతన మరియు అతిపెద్ద కంపెనీగా చెప్పవచ్చు. ఇది 2 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌పై ATM ఫ్రాంచైజ్ అందిస్తుంది మరియు ఈ డిపాజిట్ మొత్తం తిరిగి రీఫండ్ చేయబడుతుంది. అంతేకాకుండా, రూ. 3 లక్షలు వర్కింగ్ క్యాపిటల్‌గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ATM ఫ్రాంచైజ్ బిజినెస్ లో మీరు రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Also Read: Clean Andhra prdesh: క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని భారీగా ప్రారంభించిన వైఎస్ జగన్
ఈ బిజినెస్ లో ఆదాయం విషయానికి వస్తే ATM లో జరిగే ప్రతి నగదు లావాదేవీపై రూ. 8 మరియు నగదు రహిత లావాదేవీపై రూ. 2 పొందుతారు. అంటే, పెట్టుబడిపై రాబడి వార్షిక ప్రాతిపదికన 33-50 శాతం వరకు ఉంటుంది. ఉదాహరణకు... మీ ATM ద్వారా ప్రతిరోజూ 250 లావాదేవీలు... 65 శాతం నగదు లావాదేవీ మరియు 35 శాతం నగదు రహిత లావాదేవీ అయితే, మీ నెలవారీ ఆదాయం 45 వేల రూపాయలకు వరకు ఉండవచ్చు. ఒకవేళ 500 లావాదేవీలపైగా జరిగితే దాదాపు 88-90 వేల కమీషన్ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి