Delhi Metro’s driverless train : ఢిల్లీలో పింక్‌లైన్‌పై డ్రైవర్‌లెస్‌ మెట్రో పరుగులు

Delhi Metro’s driverless train operations on Pink Line inaugurated by Hardeep Singh Puri: డ్రైవర్‌లెస్‌ మెట్రో రైలు ఆపరేషన్‌ (డీటీఓ) ఇవాళ ప్రారంభమైంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి, ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ దీన్ని ప్రారంభించారు. దీంతో ఢిల్లీలో మెట్రో పూర్తి ఆటోమేటిక్‌ నెట్‌వర్క్‌ విస్తీర్ణం 97 కిలోమీటర్లకు పెరిగినట్లయింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 06:59 PM IST
  • ఢిల్లీ మెట్రో పింక్‌లైన్‌ కారిడార్‌లో డ్రైవర్‌లెస్‌ మెట్రో సర్వీస్‌ పరుగులు
  • 59 కిలోమీటర్ల పొడవైన పింక్‌ లైన్‌ డీటీఓ ప్రారంభం
  • ఇది ప్రపంచంలో నాల్గో అతిపెద్ద, భారత్‌లో ఏకైక డ్రైవర్‌లెస్‌ మెట్రో ఆపరేషన్‌ నెట్‌వర్క్‌
Delhi Metro’s driverless train : ఢిల్లీలో పింక్‌లైన్‌పై డ్రైవర్‌లెస్‌ మెట్రో పరుగులు

Driverless train operations on Pink Line begins; Delhi Metro 4th globally in DTO network: దేశ రాజధాని ఢిల్లీ మెట్రో పింక్‌లైన్‌ కారిడార్‌లో డ్రైవర్‌లెస్‌ మెట్రో సర్వీస్‌ పరుగులు పెట్టింది. 59 కిలోమీటర్ల పొడవైన పింక్‌ లైన్‌ (మజ్లిస్‌ పార్క్‌ ‌‌- శివ్‌ విహార్‌)లో డ్రైవర్‌లెస్‌ మెట్రో రైలు ఆపరేషన్‌ (డీటీఓ) (driverless train operations) ఇవాళ ప్రారంభమైంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి, (Union minister for housing and urban affairs, Hardeep Singh Puri) ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ (Delhi transport minister Kailash Gahlot) దీన్ని ప్రారంభించారు. దీంతో ఢిల్లీలో మెట్రో పూర్తి ఆటోమేటిక్‌ నెట్‌వర్క్‌ విస్తీర్ణం 97 కిలోమీటర్లకు పెరిగినట్లయింది.

ఇది ప్రపంచంలో నాల్గో అతిపెద్ద, భారత్‌లో ఏకైక డ్రైవర్‌లెస్‌ మెట్రో ఆపరేషన్‌ నెట్‌వర్క్‌. ఇక ఈ సదుపాయం ఉన్న ప్రపంచంలోని పలు దేశాల సరసన భారత్‌ నిలిచింది. గతేడాది మెజెంటా లైన్‌లో డీఓటీ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. పింక్‌లైన్‌ (Pink Line) మొత్తం 58.43 కిలోమీటర్లు . మొత్తం 38 స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 26 ఎలివేటెడ్‌, 12 భూగర్భ స్టేషన్లున్నాయి.

Also Read : Turkey chicken : వైరల్ వీడియో : కోసుకుని తింటారేమోనని ఏడ్చేస్తోన్న కోడి

ఇక మెజెంటా లైన్‌లో డీటీఓ సౌకర్యం 2020 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. దీంతో ఢిల్లీ మెట్రో (Delhi Metro) పూర్తిగా ఆటోమేటెడ్ మెట్రో నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న ప్రపంచంలోని ఏడు శాతం మెట్రోల ఎలైట్ గ్రూప్‌లోకి ప్రవేశించినట్లయింది. ఈ డ్రైవర్‌లేని రైళ్లు ప్రీ ఇండక్షన్ చెకింగ్ మాన్యువల్ ప్రక్రియను తొలగిస్తాయి. అలాగే రైలు (Train) ఆపరేటర్లపై భారాన్ని తగ్గిస్తాయి. 

Also Read : Shekar Teaser: రాజ'శేఖర్' టీజర్ అదిరింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News