DMK Saidai Sadiq Apologizes to Kushboo: బీజేపీలో ఉన్న కుష్బూతో పాటు మిగిలిన నటీమణులను కించపరిచేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత అధిష్ఠాన వక్త సైదై సాదిక్ దిగివచ్చారు. తన మాటలతో కుష్బూ మనసు గాయపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ట్విట్లర్‌లో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి కొందరు వీడియోను వైరల్ చేశారని.. తాను అలా మాట్లాడలేదని ఆయన వివరణ ఇచ్చారు.
తమిళనాడు బీజేపీలో ఉన్న కుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్ వంటి వారందరూ ఐటమ్స్ అంటూ సైదై సాదిక్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో కుష్బూ పెద్ద ఐటమ్ అంటూ ఆయన మాట్లాడారు. అంతేకాకుండా అమిత్ షా తల మీద వెంట్రుకైనా మొలుస్తుందేమో.. కానీ తమిళనాడులో కమలం మాత్రం వికసించదంటూ సైటెర్లు కూడా వేశారు.
తన మీద చేసిన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నాయకురాలు, నటి కుష్బూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'స్త్రీలను పురుషులు దుర్భాషలాడితే.. అది వారి పెంపకం, వారు పెరిగిన విషపూరిత వాతావరణాన్ని చూపిస్తుంది. వాళ్లు తమను తాము కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. ఇది సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో ఇది కొత్త ద్రావిడ మోడల్ ఆ..?' అంటూ ఆమె ట్వీట్ చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళికి ట్యాగ్ చేశారు.
మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు చెబుతున్నామని కనిమొళి అన్నారు. సీఎం స్టాలిన్ ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకడారని స్పష్టం చేశారు. ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో సాదిక్ కూడా క్షమాపణలు కోరారు. తాను ఏ ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశంతో అలా అనలేదని వివరణ ఇచ్చుకున్నారు.
డీఎంకే నేత సాదిక్ క్షమాపణలపై చెప్పడంపై కుష్భూ స్పందించారు. 'ఈ సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డీఎంకే పార్టీ కార్యకర్త చేసిన వ్యాఖ్యలకు నేను చేసిన పోరాటం నా కోసమే కాదు.. ప్రతి మహిళ కోసం చేశా. ఇలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కొన్న ప్రతి మహిళ పోరాడాలి. ఇలా దుర్భాషలాడినప్పుడు మనం పోరాడకపోతే.. వాళ్లు లైట్ తీసుకుంటారు.
మహిళలంటే ఆడుకునే ఆట బొమ్మకాదు. ఇలాంటవి వ్యాఖ్యలు నా పార్టీ వాళ్లు చేసినా.. ఎవరు చేసినా క్షమించకూడదు. డీఎంకే నేతలు తమ పార్టీ సభ్యుడు చేసిన చర్యను సమర్థించుకోవడం సిగ్గుచేటు. వారి కుటుంబాల్లోని మహిళలను 'ఐటెమ్‌లు' అని పిలిచినా ఏం అనుకుండా ఉంటారా..?' అంటూ కుష్భూ ట్వీట్స్ చేశారు.
Also Read: Aarogyasri: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆరోగ్యశ్రీలోకి మరో 809 చికిత్సలు
Also Read: TRS MLAS BRIBE: పోలీసుల దగ్గర ముడున్నర గంటల వీడియో.. కేసీఆర్ చేతిలో బీజేపీ పెద్దల చిట్టా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook