Viral Video: మహిళ రోడ్డు దాటుతుండగా.. మీదికి దూసుకెళ్లిన ఆగిఉన్న బస్సు! ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Woman Mowed Down By Bus While She Cross Road in Delhi. సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను బస్సు ఢీకొట్టింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 1, 2022, 12:08 PM IST
  • మహిళ రోడ్డు దాటుతుండగా
  • మీదికి దూసుకెళ్లిన ఆగిఉన్న బస్సు
  • ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Viral Video: మహిళ రోడ్డు దాటుతుండగా.. మీదికి దూసుకెళ్లిన ఆగిఉన్న బస్సు! ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Bus hits woman While she was crossing the road in Delhi: రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాద దృశ్యాలు పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు బస్సును సీజ్ చేశారు. 

వివరాల ప్రకారం... సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని ఝండేవాలన్‌లోని కాల్ సెంటర్‌లో సప్నా యాదవ్ అనే మహిళ పనిచేస్తోంది. మార్కెట్ ఏరియా రద్దీగా ఉన్న సమయంలో సప్నా నడుచుకుంటూ విధులకు వెళుతోంది. రోడ్డుపై నడుస్తున్న క్రమంలో ఆగిఉన్న బస్సుకు ఎడమవైపు నుంచి ఆమె నడుచుకుంటూ వెళుతోంది. సప్నా బస్సును దాటేటప్పుడు.. బస్సు ఆగివుంది. ఎప్పుడైతే సప్నా బస్సు దాటి ముందుకు వెళ్లిందో.. బస్సు మూవ్ అయింది. బస్సు అకస్మాత్తుగా కదిలి ఆమెపైకి దూసుకెళ్లింది. 

రోడ్డుపై ఉన్న ప్రజలు డ్రైవర్‌ను ఆపమని కేకలు వేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే బస్సు సప్నాపైకి ఎక్కేసింది. దాంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌, అతని సహాయకుడు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి.. కేసు నమోదు చేసుకున్నారు. బస్సు డ్రైవర్, క్లినర్‌లను పట్టుకునేందుకు పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు బస్సును సీజ్ చేశారు. తూర్పు ఢిల్లీలోని శాస్త్రి పార్క్‌లో సప్నా నివాసం ఉంటున్న పోలీసులు తెలిపారు. 

Also Read: Mark Adair: ఒకే ఓవర్‌లో 11 బంతులు.. టీ20 ప్రపంచకప్‌లో చెత్త రికార్డు!

Also Read: IND vs SA T20 World Cup 2022: టీమిండియా డర్టీ ఫీల్డింగ్.. సఫారీ చేతిలో కావాలనే ఓడిపోయింది.. పాక్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్‌  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News