Delhi Pollution: ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం, కారణమేంటంటే

Delhi Pollution: దేశ రాజధాని నగరం ఢిల్లీ మరోసారి వణికిపోతోంది. వాయ కాలుష్యం అమాంతంగా పెరిగిపోయింది. వాయ నాణ్యత దారుణంగా క్షీణిస్తుండటంతో ఆందోళన రేగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి  కారణమేంటంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 18, 2021, 04:39 PM IST
  • ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన వాయు కాలుష్యం, కారణాలపై విశ్లేషణ
  • ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల్ని తగలబెట్టడమే కారణమని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విశ్లేషణ
  • ఆదివారం నాడు ఢిల్లీలో 14 శాతంగా నమోదైన వాయు కాలుష్యం
Delhi Pollution: ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం, కారణమేంటంటే

Delhi Pollution: దేశ రాజధాని నగరం ఢిల్లీ మరోసారి వణికిపోతోంది. వాయ కాలుష్యం అమాంతంగా పెరిగిపోయింది. వాయ నాణ్యత దారుణంగా క్షీణిస్తుండటంతో ఆందోళన రేగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి  కారణమేంటంటే..

దేశ రాజధానికి ఉన్న ఒకే ఒక పెను సమస్య వాయు కాలుష్యం. ప్రతియేటా అక్టోబర్-నవంబర్-డిసెంబర్ వస్తే చాలు కాలుష్యం మరింతగా పెరిగిపోతుంటుంది. నిన్న ఢిల్లీలో హఠాత్తుగా కాలుష్యం రేటు 14 శాతంగా నమోదై ఆందోళన కల్గించింది. ఇంత పెద్దమొత్తంలో కాలుష్యం నమోదవడం కలవరం రేపుతోంది. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలతో కాస్త ఉపశమనం కలిగినా..మళ్లీ గాలి నాణ్యత(Air Quality)క్షీణించడం ప్రారంభమైందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచించింది. 

పంట వ్యర్ధాల్ని ప్రతియేటా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రైతులు అక్కడే పొలాల్లో తగలబెడుతుంటారు. ఇదంతా ఢిల్లీ సరిహద్దులోని హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతుంటుంది. ఆ పొగంతా ఢిల్లీను కమ్మేస్తుంటుంది. నిన్న ఒక్కసారిగా 14 శాతం కాలుష్య రేటుకు కారణం కూడా పంటవ్యర్ధాల్ని తగలబెట్టడమేనని తెలిసింది. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందించిన డేటా ప్రకారం పంజాబ్‌లో గత రెండ్రోజుల్లోనే 1089 పంట వ్యర్ధాల్ని తగలబెట్టారు. అదే విధంగా రాజస్థాన్, మధ్య‌ప్రదేశ్, హర్యానాల్లో 1789 పంటవ్యర్ధాల్ని కాల్చారు. పొరుగు రాష్ట్రాల ప్రభావంతోనే ఢిల్లీలో వాయు కాలుష్యం(Delhi Air Pollution)పెరుగుతోంది. పదిరోజుల్లో జరిగిన సంఘటనల కంటే రెండ్రోజుల్లో నమోదైన పంట వ్యర్ధరాల తాలూకు పొగ ఎక్కువగా ఉందని డేటా చెబుతోంది. సాధారణంగా అక్టోబర్-నవంబర్ నెలల్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరికోతలుంటాయి. ఆ తరువాత గోధుమ, బంగాళాదుంప సాగు చేస్తారు. పంట అవశేషాల్ని త్వరగా తొలగించే ప్రక్రియలో భాగంగా రైతులు వ్యర్ధాలకు నిప్పు పెడుతుంటారు. ఢిల్లీఎన్‌సీఆర్(Delhi NCR) పరిధిలో వాయు కాలుష్యం పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా ఉంటోంది. 

Also read: Delhi-Tirupati: ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్, స్పైస్‌జెట్ సర్వీసు ప్రారంభించిన కేంద్రమంత్రి సింధియా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News